Analyst Damu Balaji : హయత్ నగర్ రాజేష్ హత్యలో ఆ టీచర్ కుటుంబమే అంతా చేసిందా?? అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : నేటి సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోతే వివహేతర సంబంధాలు. ఎక్కువగా వెలుగు చూస్తున్న క్రైమ్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మరో వ్యక్తి ఉండటమే చాలా కుటుంబాలలో కలహాలకు కారణమవుతోంది. అడ్వాన్స్ టెక్నాలజి అందుబాటులో ఉండటం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ రహస్యంగా పెట్టడం సాధ్యపడదు. అందుకే మోసపోయిన వారు చావడమో లేక వారి పార్టనర్ ని చంపడమో చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హయత్ నగర్ రాజేష్ హత్య కేసులో కూడా అలాంటి పరిస్థితులే వెలుగులోకి వచ్చాయి.

వివాహేతర సంబంధమే కారణమా…

ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన రాజేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇక హయత్ నగర్ లో ప్రభుత్వ టీచర్ గా ఉన్న సుజాత అనే మహిళతో రాంగ్ డయల్ ద్వారా పరిచయమాయ్యాడు రాజేష్. మొదట్లో ఇద్దరి మధ్య మెసేజెస్ నడిచాయి. రాజేష్ ఆమె పెళ్లికాని అమ్మాయి అనుకుని మాట్లాడాడు అలాగే ప్రేమించాడు. కానీ ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసాక దూరం పెట్టాడు. అయితే సుజాత తరచూ మాట్లాడకపోతే చనిపోతా అంటూ బెదిరించడం చేసిందని ఆమె అలా అనే సరికి నేనూ చనిపోతా అంటూ రాజేష్ కూడా మెసెజ్ పెట్టడం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే చివరిసారిగా మే 22న చైతన్యపురిలోని తన స్నేహితుడు సాయి ప్రకాష్ ఉంటున్న హాస్టల్ నుంచి ఓ పెళ్లికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చిన రాజేష్, మే 24 నుంచి ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్‌ చేయలేదు. ఆపైన సుజాత ఇంటి సమీపంలోనే శవమై కనిపించాడు. సుజాత భర్త మాటలు అనుమాస్పదంగా ఉన్నాయంటూ చెప్పారు దాము బాలాజీ. సుజాత భర్త నాగేశ్వరావు మొదట రాజేష్ ఎవరో తెలియదు అని చెప్పడం, మరోసారి రాజేష్ నా భార్యను బెదిరించడం వంటివి చేయడం వల్లే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే సుజాత భర్త, కొడుకు కలిసి ఆమెతో పురుగుల మందు తాగించారని ఆపైన రాజేష్ ను కొట్టించి హత్య చేయించి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నట్లు బాలాజీ తెలిపారు.