Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాలకృష్ణ సినిమాల విషయంలో ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతారనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ విషయంలో చాలా సెంటిమెంట్ ఉందని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమాలో కూడా సింహ అన్న పేరు తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన సినిమా టైటిల్స్ లో సింహ అనే పేరు కనుక ఉంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సైతం బాలయ్య సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది అయితే ఈ సినిమాకు ఒక టైటిల్ ఖరారు చేశారంటూ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భగవంత్‌లాల్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే మొదలైంది. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్ గా ఉండబోతుందని అంటున్నారు.
ఈ విషయాన్ని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ రావిపూడి బాలయ్య సెంటిమెంటును గౌరవిస్తూ ఈ సినిమా టైటిల్ లో కేసరి అనే పదాన్ని పెట్టారని తెలుస్తుంది. సింహాన్ని హిందీలో కేసరి అంటారు కనుక సింహ అనే సెంటిమెంట్ వచ్చే విధంగా ఈ సినిమాలో కేసరి అనే పదం ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా టైటిల్ లో కూడా సింహ అనే అర్థం రావడంతో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కాబోతుందని అభిమానులు సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…