Anchor Anitha Chowdary : పొరపాటు జరిగింది… అన్నయ్య చనిపోయారు : యాంకర్ అనితా చౌదరి

Anchor Anitha Chowdary : తొంభైల్లో యాంకర్ గా అన్ని ఛానెల్స్ లో పనిచేసి పాపులర్ అయిన అనితా చౌదరి ఈటీవీ లో యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఆ తరువాత మంజుల నాయుడు గారి సీరియల్ కస్తూరితో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుసగా ఋతు రాగాలు, నాన్న అంటూ సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోను నటించిన అనితా చౌదరి మొదట హీరోయిన్ గా శ్రీకాంత్ తాళి సినిమాలో అవకాశం వచ్చి స్క్రీన్ టెస్టు లో పాస్ అయినా యాంకరింగ్ ఒక ఏరు నెలలు మానేయమని చెప్పడంతో అవకాశం వదులుకుంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛత్రపతి, మురారి, ఉయ్యాల జంపాల ఇలా చాలా సినిమాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెర, వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పరమైన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలిపారు.

ఆ పొరపాటు వల్ల అన్నయ్య చనిపోయారు…

తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడంతో కలకత్త లో పుట్టిన అనితా చౌదరి ఆమె ఐదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేసారు. ఇక తాను ఐదో తరగతి చదివే సమయానికి తండ్రి వారి నుండి వెళ్లిపోవడంతో తల్లే పెంచింది. ఇక అనితా చౌదరి గారికి ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క ఉండగా అక్కకు త్వరగా పెళ్లి చేసేసారు. ఇక ఇంటర్ చదువుతున్న సమయంలోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడిన అనిత గారు ఆ తరువాత ఈటీవీ, జెమినీ టీవీల్లో యాంకర్ అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్ లో ముందుకు సాగింది. కుటుంబ బాధ్యతలు తీసుకొన్న తాను ప్రేమ పెళ్లి వైపు వెళ్ళకూడదని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నా హీరో శ్రీకాంత్ కజిన్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినా కుటుంబం లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అనిత గారు ముందుండాలి అన్నట్టుగా వారి కుటుంబంలో ఉండేది.

అలా ఒక పొరపాటు వల్ల తన అన్న చనిపోయాడని అనిత ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అనిత గారి అన్న రవి కి పక్షవాతం రావడం బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టుకుపోవడం తో ఆసుపత్రిలో ఉండగా వెంటిలేటర్ మీద చికిత్స అందించాల్సి వచ్చినపుడు కేర్ టేకర్ గా అనిత గారి అనుమతి హాస్పిటల్ లో అవసరమైంది. అయితే అదే సమయానికి ఆమె షూటింగ్ లో ఉండటం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆలస్యంగా విషయం చేరడం వల్ల ఆయన మరణించారు. ఒకవేళ తన అన్నతో ఉండి ఉంటే బ్రతికి ఉండేవాడేమో అని ఎమోషనల్ అయ్యారు. తన అన్న డిసెంబర్ 28 న మరణించారని అదే రోజు తన కొడుకు బర్త్ డే కావడం తో ముందు రోజు తన అన్నకు హాస్పిటల్ లో ఉన్నపుడు కేక్ కట్ చేయిద్దాం ఇక్కడే నువ్వు కోలుకోవాలని చెప్పినా ఆయన వెళ్లిపోయారు అంటూ బాధపడ్డారు. ఇక తన మావయ్య తన పుట్టినరోజునాడే మరణించాడనే విషయం కొడుకు చెప్పకుండా అనిత గారు దాచి నాలుగేళ్ళ తరువాత కొంచెం పెద్దవాడయ్యాక చెప్పారట.