Actress Kalpika: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమాలో పలువురు నటిమలు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.
తాజాగా సమంత మయోసైటిస్ గురించి నటి కల్పిక గణేషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె కూడా యశోద సినిమాలో కీలక పాత్రలో నటించారు. కల్పిక గణేషన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో కూడా సందడి చేశారు.ఇక ఈ సినిమా కార్యక్రమంలో భాగంగా కల్పిగా మాట్లాడుతూ తాను కూడా సమంత లాగే మాయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు.
ఫస్ట్ స్టేజ్ లో మాయోసైటిస్..
అయితే తను గత 13 ఏళ్లగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని ఇప్పటికీ వ్యాధి ఫస్ట్ స్టేజ్లో ఉన్నానని చెప్పారు. కానీ సమంత మాత్రం ప్రస్తుతం థర్డ్ స్టేజ్ లో ఉందని వెల్లడించారు. త్వరలోనే తాను సమంతను కలిసి ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన పొందాలని భావిస్తున్నానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా సమంత బాధపడుతున్నటువంటి మయోసైటిస్ వ్యాధి గురించి నటి కల్పిక చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…