మైత్రికి మరో మెగా హిట్..ఈ పరంపర కొనసాగుతుందా..?

2015 సంవత్సరంలో మొదటి సారిగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు రూపుదిద్ధుకుంది. 70 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన ఈ చిత్రం అగస్టు 7, 2015న ప్రపంచవ్యాప్తంగా 2500 తెరలపై విడుదలైనది. దీని నిర్మాణంలోనే రూపుదిద్దుకున్న మరో సినిమా జనతా గ్యారేజ్. ఇది 2016 సంవత్సరంలో విడుదలైది.

తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ , సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018 న విడుదలైంది. తర్వాత సాయిధరమ్ తేజ్ చిత్రం సుప్రీమ్. ఈ సినిమా కూడా వసూళ్లలో ముందు వరుసలో ఉంది. ఇక వైష్ణవ్ తేజ్ తో కూడా ఇదే సంస్థ నిర్మించిన మరో చిత్రం ఉప్పెన.

ఎంత పెద్ద సంచలనం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కువ శాతం మెగా హీరోలకు మైత్రీ మూవీ మేకర్స్ కి మంచి అనుబంధం ఉంది. ఇక తాజాగా ఇదే బ్యానర్ పై విడుదలైన చిత్రం పుష్ప. ఈ చిత్రం కూడా ఈ బ్యానర్ పై హిట్ టాక్ ను తెచ్చుకుంది. మెగా కాంపౌండ్ లో ఇలా హ్యాట్రిక్ విజ‌యాలు చూసిన మైత్రీ సంస్థ‌.. పుష్ప - ద రైజ్తోనూ ఆ పరంపరను సాగించింది.

ఈ రోజు వరకు పుష్ప పాజిటివ్ టాక్ తోనే కొనసాగుతోంది. అంతే కాకుండా ఇదే బ్యానర్ పై త్వరలో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా మెగా ఫ్యామిలీకి.. మైత్రీ బ్యానర్ కు ఉన్న అనుబంధం.. విజయవంతంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇంకా రాబోయే సినిమాలు కూడా ఈ బ్యానర్ లో ఎలాంటి సంచలనాలు సాధిస్తాయో చూడాలి.