ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప. భారీ అంచనాల మధ్య ఈరోజు మూవీ రిలీజ్ అయింది. అయితే సినిమాకు ఏర్పడి క్రేజ్ కారణంగా అన్ని వర్గాల ప్రేక్షకులు పుష్ప మూవీ కోసం తొలిరోజే పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు. అయితే అనుకున్నట్లుగా పుష్ఫ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోలేదని తెలుస్తోంది.
కేవలం బన్నీ అభిమానులకు మాత్రమే సినిమా నచ్చిందని టాక్. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పుష్ఫ విఫలమైందని అంటున్నారు ఆడియెన్స్. బాహుబలి 1 లో లాగా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపారనే ట్విస్ట్ లాంటివి పుష్ప సినిమాలో లేకపోవడం పుష్పకు మైనస్. విలన్ క్యారెక్టర్ ఫహాద్ ఫాజిల్, హీరో అల్లు అర్జున్ మధ్య బలమైన సీన్లు లేకపోవడంతో ఆడియెన్స్ కు అంతగా ఆకట్టుకోలేపోయిందని తెలుస్తోంది.
అయితే గతంలో మహేష్ బాబు పుష్ప సినిమా రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మూవీని రిజెక్ట్ చేసి మంచి పని చేశారని మహేష్ ఫ్యాన్స్, సగటు ఆడియన్స్ అంటున్నారు. రంగస్థలం మూవీ తర్వాత పుష్ప మూవీ స్టోరీని ముందుగా సుకుమార్ మహేష్ బాబుకే వినిపించాడు. అయితే క్రియేటివ్ ఢిపరెన్స్ వల్ల ఈ సినిమా చేయలేదని గతంలో మహేష్ వెల్లడించారు.
అయితే పుష్ప సినిమా చూసిన నెటిజెన్లు ఈ సినిమా మహేష్ కు సూట్ కాదని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ ఈ సినిమా చేయకుండా మంచి పని చేశారని అంటున్నారు. కాగా భవిష్యత్తులో సుకుమార్ మహేష్ కాంబినేషన్లో మూవీ వస్తుందో లేదో చూడాలి. ఇదివరకే వన్ నేనొక్కడినే సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేశారు. కథ పరంగా సినిమా చాలా బాగుండగా… ఎందుకనో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఫలితంగా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…