బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అనేది తెలియనుంది. ఇక పోతే ఈ రెండు రోజులు కూడా హౌజ్ లో పెద్ద హంగామానే జరగనుంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ కు భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మాజీ కంటెస్టెంట్లను హౌజ్ లోకి పంపించి సందడి చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించి ఎపిసోడ్ నేడు రాబోతోంది. అయితే బయట కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాళ్లు హౌజ్ లోనే ఓ రూంలో ఉండి వాళ్లతో ముచ్చటించనున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ గీతామాధురి, బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్థక్, రోల్ రైడా మరియు హరితేజలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వీళ్ల రాకతో బిగ్ బాస్ హౌస్ మొత్తం సందడి సందడిగా మారనుంది. ఎవరి ఆట ఎలా ఉంది..ఎవరికి పంచ్ లు ఇస్తారో.. ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో చూడాలి. ఇక పోతే ఫైనల్ ను ఈ సారి బిగ్ బాస్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ రోజు సాంగ్స్ సెట్ పై షూట్ చేశారట. ఫైనల్ రోజు బిగ్ బాస్ టెలికాస్ట్ అనేది సాయంత్రం 6.00 లేదా 6.30 సమయాల్లో ఉండనుంది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు ఉండనుందనేది తెలుస్తోంది. నిన్నటి వరకు శ్రీరామ చంద్ర ఓటింగ్ లో మూడో స్థానంలో ఉండగా.. ఒక్కసారిగా రెండో స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు..సన్నీ ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యారని.. షణ్ముఖ్ కు కూడా ఓట్లు బాగానే వస్తున్నాయనేది టాక్. ఏదేమైనా ఎక్కవ శాతం ఈ సారి టైటిల్ సన్నీ గెలుస్తాడనేది చాలామంది నమ్ముతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…