జగన్ సంచలనం.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నేటి నుంచి రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈరోజు ఉదయం 10.20 గంటలకు పునాదిపాడుకు చేరుకుని జగన్ మొదట నాడు నేడు పనులను పరిశీలించనున్నారు. ఆ తరువాత విద్యార్థులతో వివిధ అంశాలకు సంబంధించి ముచ్చటించనున్నారు.

అనంతరం సీఎం జగన్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను అందించనున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం స్కూల్ బ్యాగ్, జత బూట్లు, మూడు జతల యూనిఫాం, సాక్సులు, టెక్స్ట్ బుక్స్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనుంది. ప్రభుత్వం విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ఇస్తూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇలా విద్యార్థులకు కిట్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్ సర్కార్ మాత్రమే కావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరోవైపు జగన్ సర్కార్ విద్యార్థుల తల్లుల ఖాతాలలో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. యూనీఫాం కుట్టుకూలి కోసం ప్రభుత్వంనగదు జమ చేయనుంది. ఇందుకోసం జగన్ సర్కార్ 650 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. 42,34,322 మంది విద్యార్థులు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు కిట్లు అందాయని సమాచారం.

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు మాట్లాడుతూ విద్యార్థులకు కిట్ రాకపోయినా, కిట్ లో వస్తువులు మిస్ అయినా ఆందోళన చెందకుండా స్కూల్ హెడ్ మాస్టర్ లేదా మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచనలు చేసింది. కిట్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 91212 96051, 91212 96052 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఫోన్ లైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.