AP politics: కాయ్ రాజా కాయ్.. ఎన్నికలవేళ ఏపీలో కోట్లలో నడుస్తున్న బెట్టింగులు!

AP politics: ఏపీ ఎన్నికలు సర్వత్ర ఉత్కంఠతను కొనసాగిస్తున్నాయి. ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తూ ఈ ఐదేళ్ల కాలంలో మీ బిడ్డ పాలన నచ్చితేనే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ చాలా ధైర్యంగా చెబుతున్నారు. అంతేకాకుండా తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవ్ అంటూ కూడా సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే మరోవైపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగలేక బిజెపి అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. దీంతో ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే పలు సంస్థలు భారీ స్థాయిలో సర్వేలు నిర్వహించారు. అయితే అన్ని సర్వేలలో కూడా వైసీపీకి అనుకూలంగా రావడంతో పెద్ద ఎత్తున ఏపీలో బెట్టింగ్ కూడా నడుస్తుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి.

అధికారం ఎవరిది…

వచ్చే ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందని కాదు వైసిపి అధికారంలోకి వస్తుంది అంటూ కోట్లలో బెట్టింగులు కట్టారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పట్టణాల నుంచి మొదలుకొని పల్లెల్లో కూడా రాజకీయపరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరి ఈసారి ఏపీ అధికారం ఎవరి చేతులలోకి వెళ్ళబోతోందనే విషయాలు తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.