Arudhra Nakshatra Pournami : నేడు ఆరుద్ర నక్షత్రం లో పౌర్ణమి… 100 ఏళ్ళ తరువాత వస్తున్న రోజు… దరిద్రానికి, మోసపోవడం వంటి వాటికి చెక్ పెట్టేరోజు వచ్చేసింది..!

Arudhra Nakshatra Pournami : వందేళ్ళకొకసారి వచ్చే అద్భుతమైన యోగం జనవరి ఆరవ తేదీ నాడు అనగా నేడు వచ్చింది. శివుడికి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి వచ్చింది. ఈరోజున చంద్రుడికి అలానే శివుడికి పూజలు చేసుకుంటే మనకు పట్టిన దరిద్రాలు, మోసాలు పోతాయి. జీవితంలో తెలిసీ తెలియక చాలా మంది ఒకరి చేతుల్లో మోస పోతూ ఉంటారు. ఈ రోజున చంద్రుడికి పూజలు చేస్తే అలాంటి మోసాలనుండి బయట పడుతారు అంటూ పండితులు నానాజీ పట్నాయక్ చెబుతున్నారు.

చంద్రుడికి ఎలా పూజలు చేయాలి…

నానాజీ పట్నాయక్ గారు నేడు చెయ్యాలిసిన పూజల గురించి వివరిస్తూ చంద్రుడికి పూజించాలని సూచించారు. ఒక్కో పౌర్ణమి లేదా అమావాస్య వచ్చే నక్షత్ర సమయాన్ని బట్టి యోగం. సిద్ధిస్తుంది. ఈరి ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి వచ్చింది. అంటే ఆ సమయంలో చంద్రుడు మిథున రాశిలో, రవి ధనుస్సు రాశిలో ఉంటాడు. చంద్రుడు, రవి ఇద్దరూ 180 డిగ్రీ కోణంలో ఉంటారు. చాలా మందికి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఎపుడూ విచారంగా ఉంటారు.

ఈ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజున వారు చంద్రుడికి పూజ చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. అలానే దుర్గా మాత గుడికి లేదా శివాలయం దర్శనం చేసుకుంటే మంచిది. ఈరోజు ఉదయం దీపారాధన సమయంలో చంద్రుడు, రాహువులకు పూజ చేస్తే మంచిది. అలాగే సాయంత్రం బియ్యపు పిండితో చేసే చలివిడి చేసి మరో ప్రసాదం ఏదైనా చేసుకుని దీపారాధన చేసి చంద్రుడికి చూపుతూ చంద్రుడికి సంబంధించిన ఏవైనా శ్లోకాలు చెప్పి పూజ చేసి ఆపైన ప్రసాదం స్వీకరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు అంటూ నానాజీ పట్నాయక్ గారు తెలిపారు.