Movie News

Getup Srinu: మీ ఉనికి కోసం అపద్దాలు చెప్పి గౌరవాన్ని కోల్పోకండి….. రోజాపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్!

Getup Srinu: గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి గెటప్ శీను మెగా ఫ్యామిలీకి విధేయుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక శ్రీను కూడా ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్లేవాడు అందుకే ఈయన పట్ల ఏ విధమైనటువంటి వివాదాలు కూడా చెలరేగలేదని చెప్పాలి.

ఇక మెగా ఫ్యామిలీకి ఎంతో విధేయుడుగా ఉన్నటువంటి ఈయన తాజాగా రోజా గారి పట్ల షాకింగ్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ టూరిజం మంత్రి రోజా మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్ వైరల్ అయ్యాయి.

దీంతో రోజా వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి గారి సేవ గుణం దానగుణం తెరిచిన పుస్తకం… ఒక స్ఫూర్తి ఆ విషయం మీకెందుకు కనపడలేదో? రోజా గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజలలో మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోకండి.మీ నోటి నుంచి ఇలాంటి పచ్చి అబద్ధాలు వినాల్సి వస్తుందని అనుకోలేదు దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ పోస్ట్ చేశారు.

Getup Srinu: గెటప్ శ్రీనుకి మద్దతుగా మెగా ఫాన్స్…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. గెటప్ శ్రీను రోజా గురించి ఇలా మాట్లాడారేంటి అంటూ కొందరు వైసిపి అభిమానులు గెటప్ శ్రీనుని దారుణంగా ట్రోల్ చేయగా గెటప్ శ్రీనుకి మాత్రం మెగా అభిమానుల సపోర్ట్ చేస్తున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago