Categories: FeaturedMovie News

Star Actress: ఒంటరిగా స్టూడియోకి రమ్మన్నారు… అతని టార్చర్ తట్టుకోలేక తప్పుకున్నాను… నటి షాకింగ్ కామెంట్స్!

Star Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటారనే సంగతి మనకు తెలిసిందే.ఇలా అవకాశాలు రావాలంటే ఇబ్బందులు తప్పనిసరి అని అయితే అందుకు కమిట్ అవ్వాలా లేదా అన్నది పూర్తిగా తమ వ్యక్తిగత నిర్ణయం అంటూ ఎంతో మంది సినీ తారలు ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే భోజ్ పూర్ నటి యామిని సింగ్ నటుడు పవన్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు నటుడు పవన్ సింగ్ తో కలిసి బాస్ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో పవన్ సింగ్ తనకు అవకాశం కల్పించారని చెప్పారు కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని, దర్శకుడు అరవింద్ చౌబే ఆఫర్ చేశారని గుర్తుచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే వరకు తనకు పవన్ సింగ్ పట్ల ఎంతో గౌరవం ఉండేది అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తన నిజ స్వరూపం తెలిసిందని తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకు నటుడు పవన్ సింగ్ తనకు ఫోన్ చేసి ఒంటరిగా స్టూడియోకి ఆటోలో రమ్మని పిలిచారు. ఇప్పుడు రాలేనని చెప్పడంతో సినిమా చేయాలని ఉందా లేదా అంటూ తనని బెదిరించారని యామిని సింగ్ తెలిపారు.ఆయన అలా మాట్లాడేసరికి తాను ఫోన్ కట్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.

Star Actress: రాజీపడమని అడిగారు…

ఇలా తనతో రాజీపడమని ఎన్నోసార్లు అడిగారని అతని టార్చర్ భరించలేక తాను ఆయన సినిమా నుంచి తప్పుకున్నానని ఈ సందర్భంగా నటుడు పవన్ సింగ్ గురించి నటి యామిని సింగ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరైనా మీ అక్క చెల్లి లేదా తల్లిని ఇలా అడిగితే మీరు తనని అభిమానిస్తారా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago