Manchu Lakshmi : మంచు వారి కుటుంబంలో మోహన్ బాబు గారి తరువాత విష్ణు, లక్ష్మి, మనోజ్ లు సినిమాల్లోకి అడుగుపెట్టి వారికంటూ ఒక సొంత ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి అయితే తన తెలుగు యాసతో ఫేమస్. ఇక మంచు లక్ష్మి సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఆమెరికా నుండి వచ్చిన మంచు లక్ష్మి అక్కడ వెబ్ సిరీసుల్లో నటిస్తూ నటన మీద ఇష్టాన్ని చంపుకోలేదు. ఇక ఆమె ప్రస్తుతం పలు భాషలలో వివిధ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉన్నారు.
అనుష్క అలా చేసింది…
మంచు లక్ష్మి బుల్లితెర మీద సెలబ్రిటీ షోలు చేసింది. ఆ షోల వల్ల బాగానే పేరు తెచ్చుకున్న లక్ష్మి సడెన్ గా అలాంటి ప్రోగ్రామ్స్ చేయడం మానేసింది. ఇక ప్రస్తుతం ఆహా ఒరిజినల్స్ లో ఒక షో చేస్తున్న మంచు లక్ష్మి ఆ షో చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఇంతకు ముందు షో చేసినపుడు సెలబ్రిటీస్ ను పిలవడం నా బాధ్యతగా ఉండేది, అది చాలా తలనొప్పి, నేను పిలిస్తే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నా ఒక్కోసారి అనుకోని షెడ్యూల్స్ వల్ల ఇబ్బందులను పడాలి. ఆ స్ట్రెస్ తీసుకోకూడదనే అలాంటి షోలు చేయకూడదని అనుకున్నాను. ఒకసారి అనుష్కతో నా షో గ్రాండ్ గా ప్లాన్ చేశాను, స్వీటీ కూడా వస్తానని చెప్పింది. అయితే షో కోసం అంతా ప్లాన్ చేసాక తాను షూటింగ్ కి రెండురోజుల ముందు భాగమతి ప్రమోషన్స్ కోసం రాజమండ్రి వెళ్ళింది.
తాను ఫోన్, మెసేజ్స్ కి స్పందించకపోవడం వల్ల చాలా టెన్షన్ పడ్డాను. అన్నీ రెడీ చేసుకున్నాక స్వీటీ రిప్లై ఇవ్వలేదని బాగా స్ట్రెస్ తీసుకున్నాను కానీ తాను షూటింగ్ కి ముందు రోజు వచ్చి మెసేజస్, మిస్డ్ కాల్స్ చూసుకుని నాకు కాల్ చేసి ఎందుకు అన్ని సార్లు చేసావని అడిగింది. టెన్షన్ పడ్డానని చెబితే వస్తా అన్నాను కాదా అంటూ చెప్పింది. అందుకే అప్పటి నుండి అలాంటి షోలో గెస్ట్ లను పిలిచే బాధ్యత నేను తీసుకోనని చెప్పాను. ఆహా లో కూడా మొదట వాళ్ళు కలిసినపుడు గెస్ట్ ల బాధ్యత మీదే అని చెప్పి నేను కేవలం షోకి వస్తానని చెప్పాను అంటూ మంచు లక్ష్మి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…