All posts by TD Admin

`ఈశ్వర` వీడియో సాంగ్‌లో కృతిశెట్టి ‌.. కూచిపూడి ఇరగదీసిందంతే..?

ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టిన కృతి శెట్టి మరోసారి ప్రేక్షకుల అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. కూచిపూడి చేసి తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఉప్పెన సినిమా లో తన అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతిశెట్టి .. ఒక రొమాంటిక్ సాంగ్ లో రోమాన్స్ ని కళ్ళతోనే పంచి కుర్రకారు ను నిద్రపోనీయకుండా చేసింది..`ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది కృతి శెట్టి. అందం, అంతకు మించిన అభినయం, మంత్రముగ్ధుల్ని చేసే హవభావాలతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌ మారిపోయింది.

ఇక ఉప్పెన రిలీజ్ కాకముందే ఆమెపై దర్శక నిర్మాతల కన్ను పడింది. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా కృతి ని బుక్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.. అందులో రెండు సూపర్ హిట్ అయినా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. నాని , రామ్, సుధీర్ బాబు నటిస్తుండగా త్వరలో మహేష్ తో ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.తాజాగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తాను అద్భుతమైన నృత్యకారిణి అని నిరూపించుకుంది. కుచిపూడి నృత్యం చేసి అభిమానులను, నెటిజన్లని ఫిదా చేసింది.

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విడుదల చేసిన `ఈశ్వర` వీడియో సాంగ్‌లో నృత్యం చేస్తూ కనువిందు చేసింది. ఈ వీడియో లో ఆమె ఇలా కనిపించేసరికి కృతి ఈ టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఉప్పెన సినిమాలోని ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసి ఆలపించారు.బెంచ్‌ మార్క్ డిజిటల్‌ దీన్ని రూపొందించగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ నిర్మించాయి. మొత్తంగా ఇది `ఉప్పెన` టీమ్‌ నుంచి వచ్చింది.ఇందులో కృతి శెట్టి అద్భుతమైన నృత్యంతో మైమరపింప చేసింది. ఆడియెన్స్ ని ఒలలాడించింది. మహాశివరాత్రి సందర్భంగా దీన్ని విడుదల చేయడం విశేషం.ఈ వీడియో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది..

 

పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదట..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ లుక్ లో పవన్ ఓ రేంజ్ లోకనిపించాడు. చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని అభిమానులు చెప్తున్నారు.. ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుండడంతో ఎలాంటి సందేహం లేదు. కానీ పవన్ ఫాన్స్ మాత్రం ఈ లుక్ చుసిన దగ్గరినుంచి షాక్ కి గురయ్యి ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారట.. వకీల్ సాబ్ తర్వాత సరైన అప్ డేట్ లేక అల్లాడిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ లుక్ వచ్చాక పండగ చేసుకుంటున్నారు..

ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘బాహుబలి’ చేశాక.. టాలీవుడ్ అభిమానులందరూ తమ హీరోలను కూడా అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న, ఎపిక్ మూవీస్‌లో చూసుకోవాలని ఆశపడ్డారు. అవి పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని కోరుకున్నారు. ఐతే అందరు అభిమానులకూ ఆ ఆశ తీరలేదు. చిరంజీవి ఒక్కడు ‘సైరా’తో ఆ తరహా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. పవర్ స్టార్‌కు ఉన్న క్రేజ్, బాక్సాఫీస్ స్టామినాకు సరైన పీరియడ్ మూవీ పడితే దాని రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఐతే తన క్యాలిబర్‌కు తగ్గ సినిమాలు పవన్ సెట్ చేసుకోడనే విమర్శ ఉంది.

గత కొన్నేళ్లలో పవన్ చేసిన సినిమాల వరస చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.ఐతే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్నది.. అచ్చంగా అభిమానులు కోరుకుంటున్న సినిమానే. తాముకోరుకున్న సినిమా ని పవన్ ఇంత త్వరగా చేస్తాడని వారు అనుకోలేదట.. క్రిష్ సినిమా అలాంటి సినిమానే అయినప్పటికీ అయన టేకింగ్ మీద డౌట్ ఉందట.. ఇప్పుడు ఈ గ్లిమ్ప్స్ లో అవతారం, స్క్రీన్ ప్రెజెన్స్, భారీతనం చూసి పవన్ అభిమానులు షాకైపోయిన మాట వాస్తవం. మరి సినిమాతో వారిని మరింతగా షాక్‌కు గురి చేస్తాడేమో క్రిష్ చూడాలి.

తొమ్మిదేళ్ల వయసులో నాపై రేప్.. స్టార్ హీరోయింగ్ సంచలనం..?

ఈమధ్య సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటీమణులు తమకు ఎలాంటి అన్యాయం జరిగిన ఊరుకోవడం లేదు.. వెంటనే స్పందిస్తూ వారిపై ఉన్న మచ్చ ను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ దగ్గరినుంచి తమపై కురిసే పొగడ్తల వరకు అన్నీ ప్రేక్షకులతో పంచుకుంటూ కొన్ని కొన్ని సెన్సషనల్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పింది. తన తొమ్మిదేళ్ల ప్రాయంలో జరిగినటువంటి విషయాన్నీ ఇప్పుడు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది..

బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, పాకిస్థాన్‌కు చెందిన సోమీ ఆలీ ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన బాల్యంలో లైంగిక దాడికి గురయ్యానని ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ జాతీయ మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాకిస్థాన్ పుట్టి పెరిగిన ఈ నటి అమెరికాలోని ఫ్లోరిడాకు వలసపోయారు. యవ్వనంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌పై మోజు పెంచుకొన్నారు. ఆ తర్వాత ముంబై చేరుకొని హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు.

బాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగిస్తూనే సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసింది. అప్పట్లో సల్మాన్ ఖాన్, సోమీ ఆలీ అఫైర్ గురించి బాలీవుడ్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకొన్నారు. దాదాపు 8 సంవత్సరాలపాటు సల్మాన్‌తో అఫైర్ కొనసాగించింది. అయితే తన కెరీర్ బాగానే ఉన్నప్పటికి అనూహ్యంగా హిందీ సినీ పరిశ్రమను వదిలేసింది. ప్రస్తుతం నో మోర్ టియర్స్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నది. రేప్ బాధితులకు ఓదార్పు, అండగా ఉండేలా తన సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాకిస్థాన్‌లో ఐదేళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. పనివాళ్లకు సంబంధించిన క్వార్టర్స్‌లో మూడుసార్లు లైంగిక దాడికి గురయ్యా. నా తల్లిదండ్రులకు చెబితే… ఎవరికీ చెప్పవద్దు అంటూ చెప్పారు. ఆ తర్వాత నాపై దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ 9 ఏళ్ల వయసులోను, అలాగే 14 ఏళ్ల వయసులో నేను రేప్‌కు గురయ్యాను అంటూ సోమీ ఆలీ చెప్పారు.

 

క్వారంటైన్ లో ప్రియుడిని తెగ కలవరిస్తున్న అలియా..!

పాన్ ఇండియా సినిమా RRR లో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న ఈ బాలీవుడ్ భామకు ఇటీవలే కరోనా సోకిందని అనుమానంతో క్వారంటైన్ లో ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది.. అయితే క్వారంటైన్ లో ఉండి నాలుగు రోజులు అయ్యిందో లేదో ఈమె తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ని తెగ కలవరిస్తుంది. మిస్ యు అంటూ ఇంస్టా లో పోస్ట్ పెట్టి మరీ తన అమితమైన, ఘాడమైన ప్రేమను చాటి చెప్తుంది..

ప్రియుడి చేతిలో త‌న చెయ్యి ఉన్న ఫొటోను షేర్ చేసి చాలా మిస్ అవుతున్నానంటూ కామెంట్ పెట్టింది అలియా.. గత కొన్ని రూజులుగా అలియా రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో వారిద్దరూ స్వయంగా ఒప్పుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి, లాక్‌డౌన్‌ రాక‌పోయి ఉంటే ఈ పాటికే తామిద్దరి పెళ్లి జ‌రిగి ఉండేద‌ని ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు ర‌ణ్‌బీర్. ఈనేపథ్యంలో ఇటీవలే రణబీర్ కు కరోనా సోకగా తనకు కూడా కరోనా వచ్చి ఉంటుందనే అనుమానంతో అలియా క్వారంటైన్ లో ఉంటున్నారు..

ఈ నేప‌థ్యంలో ర‌ణ్‌బీర్‌ను బాగా మిస్ అవుతోన్న అలియా.. మేజ‌ర్ మిస్సింగ్ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇకపోతే అలియా RRR సినిమా తో పాటు బాలీవుడ్ లో భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో అలియా గంగూబాయ్ క‌థైవాడి చిత్రంలో నటిస్తుంది.. భన్సాలీ కి కూడా కరోనా సోకగా అలియాకు మాత్రం నెగిటివ్‌గా తేలింది.

ఒక సినిమాతోనే సూపర్ స్టార్ పక్కన ఛాన్స్.. ఉప్పెన భామ లక్కీ ఛాన్స్..?

కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. వైష్ణవ్ హీరోగా నటించగా అయన నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి..మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను వైష్ణవ్ అందుకోగా తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. కృతి శెట్టి కూడా తన లేత అందాలతో, చక్కని అభినయంతో ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమా లోని తన నటన తో అందరి హృదయాలను కట్టిపడేసింది కృతి.. మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేసింది తనకి. ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో కృతి శెట్టి త‌న రెండో సినిమాకు ఏకంగా 75ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తోంద‌ని టాక్. ఉప్పెన సినిమా విడుద‌లకు ముందు.. విడుద‌ల త‌ర్వాత కృతి శెట్టి గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా క‌నిపించే ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది చ‌ర్చిస్తున్నార‌ట‌.

ఇకపోతే దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఈమేరకు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ నెక్ట్స్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్ గ‌ట్టిగానే వినిపిస్తుంది. ప్ర‌స్తుతం మ‌హేశ్ త‌న 27వ చిత్రం ‘స‌ర్కారువారిపాట‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు వ‌చ్చినా.. ద‌ర్శ‌కధీరుడితో మ‌హేశ్ సినిమా చేసే లోపు మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేలా ప్లాన్ చేసేశాడ‌ట‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి ఇప్పుడు నానితో శ్యామ్ సింగ‌రాయ్‌, రామ్‌, లింగుస్వామి, సుధీర్ బాబు సినిమాలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలు రిలీజ్ అయితే కృతి శెట్టి రేంజ్ మాములుగా ఉండదు మరీ..

 

లాస్య, రవిల మధ్య మ‌ళ్లీ గొడవలు.. ఆ విషయం పైనేనా..?

ఒకప్పుడు బుల్లితెరపై మోస్ట్ డెసైరబుల్ జంటగా ప్రేక్షకులను అలరించిన రవి, లాస్య ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది.. అయితే దాన్ని మా టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రాం ద్వారా చల్లబరిచారు. ఇద్దరినీ కలిపి ఒక మంచి పనిచేశారు. పలు షో లతో వీరిద్దరూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు వీరిద్దరి మధ్య పుకార్లు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నారని, అప్పటికే పెళ్లి అయినా రవి విడాకులు ఇచ్చి మరీ లాస్య ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి..

అయితే అవి ఎంతో సేపు నిలువలేదు. కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఓ ప్రముఖ డాన్స్ షో నడుస్తుండగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరం దూరం గా ఉంటున్నారు. పలు కారణాలతో వారి స్నేహ బంధాన్ని తెంచుకున్నారు.. కార‌ణాలు ఏవైనా దాదాపు ఐదు సంవ‌త్స‌రాల పాటు వీరిద్ద‌రు క‌లిసి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సంక్రాంతి కి స్టార్ మా లో కలిసి ఒక్కటై వారి అభిమానులను ఖుషి చేసిన కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ మళ్ళీ గొడవపడినట్లు తెలుస్తుంది. స్టార్ మాలో ప్ర‌తి ఆదివారం మ‌ధ్యాహ్నం కామెడీ స్టార్స్ అన్న కామెడీ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. వ‌ర్షిణి వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోకు శేఖ‌ర్ మాస్ట‌ర్, శ్రీదేవి జ‌డ్జిలుగా ఉన్నారు. ఇందులో అవినాష్, అషు రెడ్డి, సుజాత, సిరి త‌దిత‌రులు పాల్గొంటున్నారు.

ఇక అప్పుడ‌ప్పుడు సెల‌బ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతుంటారు. ఈ క్ర‌మంలో రానున్న ఎపిసోడ్‌లో రాజేంద్ర ప్ర‌సాద్ ఈ షోలో సంద‌డి చేయ‌నున్నారు. కాగా ఇక ఈ షోలో ర‌వి, లాస్య‌లు స్కిట్ చేయబోతున్నారు. ఉప్పెన స్పూఫ్‌ని వీరిద్ద‌రు చేస్తుండ‌గా.. ఒక‌రిపై ఒక‌రు మాట‌ల పంచ్‌లు వేసుకున్నారు. వీళ్ల నాన్న ఒక్క అబ‌ద్దం కూడా ఆడ‌లేదేమోరా అందుకే ఇంత ద‌రిద్రంగా పుట్టింది అని ర‌వి, లాస్య‌ను అన‌డం.. అర ఎక‌రం నుంచి నువ్వు, నేనే మాట్లాడుకోవాలి అని లాస్య అన‌డం ప్రోమోకు హైలెట్‌గా నిలిచాయి. ఇక వీరిద్ద‌రు పంచే ఎంట‌ర్‌టైన్ చూడాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే.

 

ఆదిపురుష్ లో సీతగా ఆ నటి..వైరల్ అవుతున్న ఫోటో..?

రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ పూర్తి చేశాడు.. ఈ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్నాడు. రాధే శ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. జులై 30 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో తర్వాత ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి రాధే శ్యామ్ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుందని ఎదురుచూస్తున్నారు. పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా లుక్స్ ఇప్పటికే మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయినా లుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది..

ఇక సలార్ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమవగా షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. ఇక ఈ సినిమా తో పాటే ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేయగా అందులో ఆదిపురుష్ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి..

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా తాజాగా సీత పాత్ర కు హీరోయిన్ ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం.. ఈ సినిమాలో సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై చాల పరిశీలనలు అయ్యాయి. సీత పాత్ర‌లో కీర్తిసురేష్‌, అనుష్క,కృతిస‌న‌న్‌.. ఇలా చాలా మంది పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. అయితే కృతిస‌న‌న్‌నే సీత పాత్ర‌కు చిత్ర యూనిట్ తీసుకుంది అని తెలుస్తుంది. అలాగే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో స‌న్నీ సింగ్ న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌, స‌న్నీ సింగ్, డైరెక్ట‌ర్ ఓంరావుత్‌ క‌లిసి ఉన్న ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీంతో సీత పాత్ర‌లో కృతి న‌టిస్తోంద‌నే విష‌యం ఖరారైంది.

 

ఇక సీరియల్స్ చేయనున్న రాశీఖన్నా.. సినిమాలు లేకనేనా..? రాశిఖన్నా

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఇక సినిమాలు మానేసి సీరియల్స్ చేస్తుందా అంటే అవుననే అంటున్నారు.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరిని కవ్వించిన ఈ బొద్దు గుమ్మ కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నారు.. అనుకున్నట్లుగానే ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి..జీరో సైజు వెంటపడుతున్న అభిమానులను తన బొద్దు అందాలతో తన వెంట తిప్పుకుని వారిని తన ఫ్యాన్స్ గా మార్చుకుంది..

రాశిఖన్నా లా బొద్దుగా ఉన్న అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఉన్నా ఒకప్పుడు ఇలాంటి అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువ.. పాతతరం హీరోయిన్ లను గమనిస్తే రాశి లాంటి హీరోయిన్ లే ఎక్కువ గా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమె కు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి.. తొలి సినిమాలో అందం పరంగానే కాదు రాశీఖన్నాకు అభినయం పరంగా కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తర్వాత పలు సినిమాలు చేసినా తొలిప్రేమ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని అన్నారు..

ఇకపోతే ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా, హీరో గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖ‌న్నా సీరియ‌ల్‌స్టార్‌గా క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కు మారుతి త‌న చిత్రం ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంలో రాశీఖ‌న్నాను టిక్‌టాక్ స్టార్‌గా చూపించాడు. అదే స్టైల్లో ఈసారి రాశీఖ‌న్నా సీరియ‌ల్ స్టార్‌గా చూపించ‌బోతున్నాడ‌ట మారుతి.ఇక ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ పిక్స్‌తో రెచ్చిపోతూ కుర్ర‌కారు హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేస్తుంది మ‌రి.

అనన్య పాండే ని ఇంత దారుణంగా అవమానించారా..?

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తనని ఎంత దారుణంగా అవమానించారా చెప్పుకుని తెగ ఫీల్ అయిపోతుంది.. నేపోటిజం తో ఇప్పటికే బాలీవుడ్ లో పలు ఆరోపణలు , వివాదాల్లో ఇరుకున్న అనన్య పాండే తాజగా తనని అబ్బాయిలా చూస్తున్నారని, సోషల్ మీడియా లో దానిమీద తెగ ట్రోల్స్ చేస్తున్నారని చెప్పుకుంటూ వాపోయింది.. చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అనన్య తొలి సినిమాలో తనలోని టాలెంట్ ని చూపించింది.. రావడానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తోనే అవకాశాలు ఉంటాయని నమ్మిన నటి అనన్య..

ప్రస్తుతం టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉంది.. విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అనన్య.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో జరుగుతుండగా ఇప్పటికే రిలీజ్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన దక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ డబ్బింగ్‌ను విజయ్ స్వయంగా చెప్పబోతున్నాడట. ఇందుకోసం భాషపై మరికొంత పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడని టాక్.

అయితే సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ బ్యూటీ. గతంలో చాలా సార్లు ట్రోలింగ్ బారిన పడినట్లు.. తన శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోలుస్తూ బాడీ షేమింగ్ చేసేవారని..ఈ విషయాలు తనను తీవ్రంగా బాధించేవని చెప్పింది. అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని.. ఆ సమయంలో తనను ఫ్లాట్ స్క్రీన్ అని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాడీ అచ్చం అబ్బాయిల బాడీలా ఉందంటూ విమర్శించిన విషయాలను గుర్తు చేసుకుంది.

ఆ సమస్య తో బాధపడుతున్న శృతి హాసన్.. అందుకేనా ఇలా..?

ఇటీవలే క్రాక్ సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్ శృతి హాసన్.. కమల్ హాసన్ కుమార్తె గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ అనేంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అందం, అభినయం కలిగిన శృతి హాసన్ మధ్యలో కొన్ని తప్పటడుగులు వేసినా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.. ఇటీవలే ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడం తో శృతి హసన్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా హిట్ తో హీరోకి, డైరెక్టర్ ఎంతవరకు కలిసి వచ్చిందో కానీ హీరోయిన్ శృతి హసన్ కి మాత్రం మంచి పేరుతో అవకాశాలు కూడా వస్తున్నాయి..

ఈ సినిమాలోని తన నటనకు ఫిదా అయినా ప్రభాస్ శృతి హాసన్ కి సలార్ లో అవకాశం ఇచ్చాడు. క్రాక్ సినిమా ముందువరకు శృతి హాసన్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు అంతా.. చేతిలో సినిమాలు కూడా ఏవీ లేవు.. దానికి తోడు ఆమె ఎఫైర్ ల వల్ల ఆమెను సినిమాలో పెట్టుకోవడానికి భయపడిపోయారు నిర్మాతలు.. కానీ ఇప్పుడు ఆమెచేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నాయి..

ఈ నేపథ్యంలో చిన్నతనం నుంచి తనకు యాంక్జైటీ డిసార్డర్ ఉందని తెలిపింది.నేను చాలా సంవత్సరాలుగా ఈ యాంక్జైటీతో బాధపడుతున్నాను. ఇది కొంతమందికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు.. కానీ నేను చాలా బాధపడ్డాను అని తెలిపింది. ఎందుకంటే మీరు పడే బాధ.. వేరేవారికి బాధాకరమైనది కాకపోవచ్చు. తనకు వేదికపైకి రావడం.. అక్కడ మాట్లాడడం వంటివి చాలా కాలం పాటు భయంగా ఉండేవని తెలిపింది.నేను ఓ రకమైన యాంక్జీటీతో బాధపడుతున్నానని తెలుసుకోవాడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. నేను ఈ ఆందోళన రుగ్మతతో బాధపడుతున్నానని.. నాకు 30 ఏళ్లు వచ్చిన తర్వాత గుర్తించాను అని తెలిపింది.