పాన్ ఇండియా సినిమా RRR లో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న ఈ బాలీవుడ్ భామకు ఇటీవలే కరోనా సోకిందని అనుమానంతో క్వారంటైన్ లో ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది.. అయితే క్వారంటైన్ లో ఉండి నాలుగు రోజులు అయ్యిందో లేదో ఈమె తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ని తెగ కలవరిస్తుంది. మిస్ యు అంటూ ఇంస్టా లో పోస్ట్ పెట్టి మరీ తన అమితమైన, ఘాడమైన ప్రేమను చాటి చెప్తుంది..
ప్రియుడి చేతిలో తన చెయ్యి ఉన్న ఫొటోను షేర్ చేసి చాలా మిస్ అవుతున్నానంటూ కామెంట్ పెట్టింది అలియా.. గత కొన్ని రూజులుగా అలియా రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో వారిద్దరూ స్వయంగా ఒప్పుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ రాకపోయి ఉంటే ఈ పాటికే తామిద్దరి పెళ్లి జరిగి ఉండేదని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రణ్‌బీర్. ఈనేపథ్యంలో ఇటీవలే రణబీర్ కు కరోనా సోకగా తనకు కూడా కరోనా వచ్చి ఉంటుందనే అనుమానంతో అలియా క్వారంటైన్ లో ఉంటున్నారు..
ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ను బాగా మిస్ అవుతోన్న అలియా.. మేజర్ మిస్సింగ్ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇకపోతే అలియా RRR సినిమా తో పాటు బాలీవుడ్ లో భన్సాలీ దర్శకత్వంలో అలియా గంగూబాయ్ కథైవాడి చిత్రంలో నటిస్తుంది.. భన్సాలీ కి కూడా కరోనా సోకగా అలియాకు మాత్రం నెగిటివ్‌గా తేలింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…