Babloo Prithiveeraj: 53 ఏళ్ళ వయసులో 23 ఏళ్ల యువతితో రెండో పెళ్లికి సిద్ధమైన నటుడు బబ్లూ పృథ్వీరాజ్.. వైరల్ అవుతున్న న్యూస్ !

Babloo Prithiveeraj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బబ్లూ పృధ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పృథ్వి ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అయింది.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా విదేశాలలో ఉన్నటువంటి ఈయన గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ఇదివరకే 1994లో బీనా అనే మహిళతో పెళ్లయింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. బాబుకు అహద్‌అనే పేరు పెట్టినట్లు తెలిపారు ప్రస్తుతం తన కుమారుడికి 27 సంవత్సరాలు ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈయన వెల్లడించారు. అయితే తన కుమారుడు అటిజం అనే వ్యాధితో బాధపడుతున్నారని తనకు మాట రాదంటూ ఈ సందర్భంగా పృథ్వి వెల్లడించారు.

ఇకపోతే 57 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈనటుడు గత కొన్ని సంవత్సరాలుగా 23 సంవత్సరాలు వయసు ఉన్న మలేషియా యువతీనీ రెండవ వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి వివాహం చాలా సీక్రెట్ గా జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Babloo Prithiveeraj: మలేషియా యువతిని పెళ్లి చేసుకున్న పృథ్వి…

ఈ విధంగా పృథ్వి రెండవ వివాహం గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.త్వరలోనే పృథ్వి ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 57 ఏళ్ల వయసులో ఈయన 23 ఏళ్ల యువతిని వివాహం చేసుకోవడంతో పెద్ద ఎత్తున నేటిజన్ లు ముసలి వయసులో కూతురు వయసు ఉన్న అమ్మాయితో రెండో పెళ్లి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ పెళ్లి విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.