Baladhithya : మా అన్నయ్యతో పెద్ద గొడవ అయింది… ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ ను చూసి తప్పు చేశా… ఆరోజు మమ్మల్ని చితక్కోట్టారు : బాలాదిత్య

Baladithya : తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఇక ‘1940 లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇక మొదటగా హీరోగా చేసిన ‘చంటిగాడు’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్న, లిటిల్ సోల్జర్స్ సినిమాలకు కూడా నంది అవార్డులను అందుకున్నారు బాలాదిత్య. ఇక చాలా చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య ఆ తరువాత సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఇక సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేక పోయిన బాలాదిత్య ఇపుడు బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి మరోసారి ప్రేక్షకులకు చేరువ అవ్వాలని అనుకుంటున్నారు.

ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ ను చూసి…

ఇంటర్ సెకండ్ ఇయర్ సమయంలో సినిమాల్లోకి హీరోగా చంటిగాడు సినిమాలో పరిచయమైన బాలాదిత్య అది నేను వేసిన రాంగ్ స్టెప్ అని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్ వంటివారు వస్తున్నారు. వాళ్లంతా టీనేజ్ లోనే ఎంటర్ అవుతున్నానరు నేను వెళితే బాగుంటుంది అనే ఉద్దేశం తో చేయాలని అనుకున్నాను కానీ అది సరైన సమయం కాదు, మనకంటూ ఒక ఆలోచించుకోగలిగే శక్తి వచ్చాక కథల ఎంపిక నేనే చేసుకోగలిగే పరిణితి వచ్చాక సినిమాల్లో హీరోగా వచ్చుంటే కెరీర్ వేరేలా ఉండేదేమో అనిపించింది.

ఇక మా అన్న, వదిన మాట ఇప్పటికీ తప్పను. అన్న ఏం చెబితే ఆది వింటాను ఇప్పటికీ. చిన్నతనంలో ఒకసారి గొడవపడ్డాము ఇద్దరం ఒక బొమ్మ విషయంలో ఆరోజు మా అమ్మ చేసిన పని జీవితంలో ఇంకెప్పుడూ గొడవ పడకుండా గుర్తుండిపోయింది. ఒకే బొమ్మలాంటివి రెండు తెచ్చిన ఒకటి విరిగిపోవడం వల్ల రెండో దానికోసం ఇద్దరం కొట్లాడం దానితో అమ్మ ఆ రెండో బొమ్మను విరగొట్టి ఇద్దరినీ చితకబాదింది. ఈ సారి గొడవపడితే బొమ్మలు విరగవు అంటూ హెచ్చరించింది. అంతే ఆ సంఘటన తరువాత పెద్దగా గొడవ పడింది లేదు ఇప్పటి దాకా అంటూ చెప్పారు బాలాదిత్య.