Balagam fame Vijayalakshmi: నాకు అవకాశం వచ్చింది రచ్చ రవి వల్లే… మొదటి రోజు రూప లక్ష్మి షూటింగ్ కి ఎలా వచ్చిందంటే…: బలగం ఫేమ్ విజయలక్ష్మి

Balagam fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వ కు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత ఇస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగినా వాళ్ళు ఉండాల్సిందే అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి.

రచ్చ రవి వల్లే ఈ అవకాశం…

విజయలక్ష్మి గారు సురభి నాటకమండలిలో పనిచేసే కళాకారిణి. ఆమె నాటక ప్రదర్శనలు అలాగే హారికథ చెప్పే కళాకారిణి. అయితే ఏ నాడూ తాను సినిమాల్లో ప్రయత్నించలేదు. కేవలం నాటకాలు వేసేవారు. అయితే బలగం సినిమా ఆడిషన్స్ కోసం డైరెక్టర్ వేణు యెల్దండి గారు సురభి కాలనీకి వచ్చినపుడు ఆడిషన్ లో పాల్గొని పోచవ్వ పాత్రకు సెలెక్ట్ అయ్యారు విజయలక్ష్మి. అయితే దీనంతటికీ కారణం మాత్రం రచ్చ రావినే అంటూ చెప్పారామె. జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి వేణు కి ఆర్టిస్టుల కోసం వెతుకుతున్న సమయంలో సురభి కళాకారులను చూడు నీ కథలోని పాత్రలకు బాగుంటారు అని చెబితే అక్కడికి వచ్చారట. లేకపోయింటే ఆ అవకాశం నాకు వచ్చేది కాదేమో అంటూ విజయలక్ష్మి తెలిపారు.

షూటింగ్ కి రూప లక్ష్మీ వచ్చింది…

విజయలక్ష్మి గారిని ఆడిషన్ లో సెలెక్ట్ చేసాక వర్క్ షాప్ కి రమ్మని కబురు పంపగా అక్కడ కొంతమంది ఆర్టిస్టులతో కలిసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేవారట. అపుడే రూప లక్ష్మి గారు కూడా చివరి రోజు వర్క్ షాప్ కి వచ్చి సీన్స్ ప్రాక్టీస్ చేశారని, తాను సెలెక్ట్ అయితే బాగుండని అనుకున్నాను అంటూ విజయలక్ష్మి తన మనసులోని మాట తెలిపారు. ఆమె కార్తీక మాసం పూజలు చేస్తుందనుకుంటా మొహానికి పసుపు పూసుకుని అచ్చం అమ్మవారిలాగానే వచ్చింది అంటూ తెలిపారు. అనుకున్నట్లే తానే లక్ష్మీ పాత్రకు సెలెక్ట్ అయింది అంటూ తెలిపారు.