Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుండి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అఖిల్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోగా గుర్తింపు పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ సినిమా ద్వారా హీరోగా మారిన అఖిల్ మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత అఖిల్ నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అఖిల్ ఆశలు అన్ని ఏజెంట్ సినిమా పైనే పెట్టుకున్నాడు.
అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్ ఏజెంట్ సినిమా విశేషాల గురించి మీడియాతో పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల రిలేషన్ గురించి ప్రశ్న ఎదురవగా అఖిల్ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సమావేశంలో..” మీ అన్నయ్య అఖిల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. ఫోటోలో ఒక అమ్మాయితో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి? ఒక విలేఖరి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అఖిల్ స్పందిస్తూ..” ప్రస్తుతం నా పరిస్థితి విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలుగా నా జుట్టు వాడిని మెయింటైన్ చేయటానికి టైం సరిపోవటం లేదు.
ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్ గురించి అఖిల్ స్పందించకపోవడం గమనార్హం. సమంతతో విడిపోయిన తర్వాత శోభిత తో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఇటు నాగచైతన్య అటు శోభిత కూడా స్పందించలేదు. దీంతో ఈ వార్తలు నిజమేనంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…