Balakrishna: ఆ టాలీవుడ్ హీరోల స్టామినా తగ్గిపోయిందా… బాలయ్య మాత్రమే ఫామ్ లో ఉన్నారా?

Balakrishna:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి వారి తర్వాత జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు. ఇక ఈ జనరేషన్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. అయితే చిరంజీవి కన్నా ముందుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగారు బాలయ్య.

అయితే బాలయ్య నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఊహించని విధంగా సుమన్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.ఇక మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వచ్చారు.ఇక వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరి హవా కొంతమేర తగ్గిందని చెప్పాలి.

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత కొన్ని రోజులపాటు సినిమాకు విరామం ప్రకటించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయని నిరూపించాయి. ఇక నాగార్జున బాలకృష్ణ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. ఇక నిన్న విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు రూ.16.68 కోట్ల షేర్ రాబట్టింది.

Balakrishna: ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య..

అదేవిధంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రూ.2.42 కోట్ల రూపాయలు రాబట్టింది వెంకటేష్ ఈ మధ్యకాలంలో వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈయన సినిమాలు కూడా ఎప్పుడు మొదటి రోజు 10 కోట్ల షేర్స్ రావట్లేదు.ఇక మిగిలినది నందమూరి నటసింహం బాలకృష్ణ ఈయన తాజాగా నటించిన చిత్రం అఖండ. అఖండ సినిమా విడుదల అయినా మొదటి రోజు ఏకంగా రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.దీన్ని బట్టి చూస్తే సీనియర్ హీరోలలో బాలకృష్ణనే ఫుల్ ఫామ్ లో ఉన్నారని మిగిలిన హీరోల హవా తగ్గిపోయిందని తెలుస్తుంది.