KS Ravi Kumar: బాలయ్యకు సంస్కారం లేదు.. సైకోల ప్రవర్తిస్తారు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

KS Ravi Kumar: సినీ నటుడు బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు కోపం ఎక్కువ తనని విసిగిస్తే ఎదుట ఎవరన్నా సరే వారిపై చేయి చేసుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలా అభిమానులను బాలయ్యను కొట్టడం గురించి కోలీవుడ్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జననీ జన్మభూమి సినిమా షూటింగ్ చేసే సమయంలో బాలయ్య వ్యవహారి శైలితో నా మనసు విరిగిపోయిందని తెలిపారు. కే విశ్వనాథం డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు తాను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశానని రవికుమార్ తెలిపారు అయితే ఈ సినిమా సమయంలో బాలయ్య అభిమానులు తనని చూడటం కోసం రావడంతో వారందరితో ఫోటోలు దిగుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక అభిమాని ఫోటో దిగే సమయంలో బాలయ్య పై చేయి వేయడంతో బాలయ్య ఒక్కసారిగా ఆ అభిమానిపై చేసి చేసుకొని తనని కొట్టారని తెలిపారు. ఆ ఘటన చూసి నా మనసు విరిగిపోయిందని రవికుమార్ తెలిపారు. అయితే ఒకప్పుడు ఎంతో మంచిగా ఉండే బాలయ్య ఇటీవల కాలంలో సైకోలా ప్రవర్తిస్తున్నారు ఆయనకు సంస్కారం కూడా లేకుండా పోయిందని తెలిపారు.

తిరిగి కొడితే..
ఇలా అభిమానులపై తాను చేయి చేసుకున్నప్పుడు వారు తిరిగి కొడితే నీ పరిస్థితి ఏంటి అంటూ రవికుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం బాలయ్య గురించి డైరెక్టర్ రవికుమార్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ధర్మారం రేపుతున్నాయి.