Balakrishna: రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య.. అఖండ తర్వాత చిత్రానికి ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?

Balakrishna: రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య.. అఖండ తర్వాత చిత్రానికి ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలయ్య నటించిన ‘ అఖండ’ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రికార్డ్ కలెక్షన్లను సాధించింది.

Balakrishna: రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య.. అఖండ తర్వాత చిత్రానికి ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?
Balakrishna: రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య.. అఖండ తర్వాత చిత్రానికి ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?

వంద కోట్ల క్లబ్ లో చేరింది. కరోనా లాక్ డౌన్ అనంతరం విడుదలైన భారీ చిత్రం కావడంతో.. ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.  ఇదిలా ఉంటే మరోవైపు ఓటీటీలో కూడా బాలయ్య సత్తా చూపిస్తున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది.

Balakrishna: రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య.. అఖండ తర్వాత చిత్రానికి ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?

షోలో బాలయ్య ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉన్నాయి. బాలయ్య హోస్ట్ గా కూడా తనేంటో నిరూపించాడు. మోహన్ బాబు, రవితేజ, రానా, బన్నీ, రాజమౌళి వంటి స్టార్లు గెస్ట్ లుగా వచ్చారు. వీరితో బాలయ్య.. టాక్ షో పెద్ద ఎత్తున వ్యూస్ దక్కించుకుంది.

రూ. 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు..

అయితే బాలయ్య తన రెమ్యునరేసన్ పెంచాడనే మాటలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ టాక్‌ షోకు ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ. 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 12 ఎపిసోడ్‌లకు గాను రూ. 5 నుంచి 6 కోట్ల వరకు బాలకృష్ణ వెనకేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అఖండ కూడా సూపర్ హిట్ కావడంతో బాలయ్య రెమ్యునరేషన్ పెంచారని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమాకు బాలయ్య రూ. 10 కోట్లు తీసుకున్నారని… రాబోయే సినిమాకు రూ.15-20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య ఇమేజ్, సక్సెస్, మార్కెట్ ను బట్టి ప్రొడ్యూసర్లు బాలయ్య అడిగినంత ముట్టచెప్పేందుకు కూడా ముందుకు వస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు నాలుగు ప్రాజెక్ట్ లు పట్టాలేక్కే అవకాశం ఉంది. దీంతో బాలయ్య ఓ రూ. 50 కోట్లు వెనకేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.