Metro Station-Rapido Tax: హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద అందుబాటులో ర్యాపిడో బైక్ ట్యాక్స్ లు..!
Metro Station-Rapido Tax: ర్యాపిడో బైక్ ట్యాక్స్ అంటే ప్రతీ ఒక్కరికీ సుపరిచితే. హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటే ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది. ఎందుకు ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు ఐదేళ్ల క్రితం ఈ సర్వీసును ప్రారంభించారు.
ర్యాపిడో కంపెనీ మొదట బైక్స్ కోసం మినీ ట్యాక్సీని ప్రారంభించి తర్వాత త్రీ వీలర్ అయిన ఆటోల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ల వ్యాపారాన్ని పొడిగించారు. కరోనా సమయంలో ఆ సంస్థ కాస్త నష్టాలను కూడగట్టుకున్నా ప్రస్తుతం లాభాల బాటలోనే నడుస్తోంది.
ఇక రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఉదయం పనికి వెళ్లిన ప్రజలకు ప్రయాణం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని హైదరాబాద్ మెట్రో రైల్ రాపిడో బైక్ టాక్సీ సేవతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని మెట్రో స్టేషన్లలో రాపిడో బైక్ ట్యాక్సీలను అందజేస్తుందని.. మెట్రో రైడర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.
సగటు రోజువారీ రైడర్‌షిప్ దాదాపు 2.40 లక్షలని.. రోజురోజుకు ఈ ప్రయాణాలు పెరుగుతున్నాయని ఎండీ పేర్కొన్నాడు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ప్రయాణీకుల కదలికలలో మంచి పెరుగుదల కారణంగా మెట్రో రైలు రైడర్‌షిప్ ప్రీ-కోవిడ్ సమయాల్లో 75 శాతంకు చేరుకుందని చెప్పారు. మెట్రోలో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నాడు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో నవంబర్ నెలలో ‘మెట్రో సువర్ణ’ ఆఫర్‌లో విజేతలుగా నిలిచిన ఐదుగురికి బహుమతులను అందజేశారు. ర్యాపిడో తో కనెక్టివిటీ వల్ల ఇంటి నుంచి డెస్టినేషన్ కు .. డెస్టినేషన్ నుంచి.. ప్రయాణం సులభతరం అవ్వడంతో పాటు.. టైం కూడా సేవ్ అవుతుందని తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…