Movie News

Ramesh Babu Death: దారుణం.. కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు.. అన్న భౌతికఖాయం చూడలేని స్థితిలో..!

RameshBabu Death: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య.. నటుడు-నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు జనవరి 8 శనివారం కన్నుమూశారు. రమేష్ బాబు చాలా కాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. చివరకు 56 ఏళ్ల వయస్సులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయాన్ని నిన్న ట్విట్టర్ వేదికగా ఘట్టమనేని ఫ్యామిలీ తెలియజేసింది.

మా ప్రియమైన రమేష్‌బాబు గారు మరణించారని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటాడు. మా మద్దతుదారులందరినీ కోవిడ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని .. దహన సంస్కారాలు జరిగే ప్రదేశంలో గుమికూడకుండా ఉండాలని మేము కోరుతున్నాము అంటూ ట్వీట్ చేశారు.

RameshBabu Death: దారుణం.. కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు.. అన్న భౌతికఖాయం చూడలేని స్థితిలో..!

అయితే ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే.. ఇటీవల మహీష్ బాబు కరోనాతో బాధపుడుతున్న విషయం తెలిసిందే. అతడు హోం క్వారంటైన్ లో ఉంటూ.. చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతడు దుబాయ్ కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడు కోవిడ్ టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.


చివరి చూపుకు అవకాశం కల్పిస్తారా..?

అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తేలికపాటి లక్షణాలతో COVID-19 తో బాధపడుతున్నట్లు మహేష్ ట్వీట్ చేశాడు. తాను ఇంట్లోనే ఉంటూ.. అవరమైన చికిత్స తీసుకుంటున్నాని పేర్కొన్న విషయం తెలిసిందే. తన ఫ్యామిలీ అంతా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రమేష్ బాబు మరణం తీవ్రంగా కలచివేస్తోంది. అతడి భౌతిక ఖాయాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నాడు మహేష్ బాబు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆ చుట్టు పక్కల పరిసరాల్లో కూడా రాలేని పరిస్థితి. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు చాలా చింతిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇక అతడి అన్న భౌలికఖాయాన్ని చూసేందుకు మహేష్ బాబుకు అనుమతి ఇస్తారా..? లేదా అనేది వైద్య అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago