Bigg Boss6: మొదటి వారం నామినేషన్స్ లో భారీ ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్.. కపుల్స్ కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss6: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వడంతోనే మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఇలా 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించగానే వారి మధ్య గొడవలు కొట్లాటలు కూడా మొదలైపోయాయి.

ఇకపోతే మొదటివారం నామినేషన్ ప్రక్రియ ఎంతో రంజుగా సాగిందని చెప్పాలి. ఈవారం నామినేషన్ లో భాగంగా మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. బాలాజీత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానా, సత్య శ్రీ, ఫైమా, రేవంత్, చలాకి చంటి, ఆరోహి నామినేషన్ లో ఉండగా బిగ్ బాస్ ట్రాష్ విభాగంలో ఉన్నటువంటి బాలాజీత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానా ముగ్గురిలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని క్లాస్ టీంలో ఉన్న సభ్యులకు ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో బాలాదిత్యను సేవ్ చేయడంతో మిగిలిన 7 నామినేషన్స్ లో ఉన్నారు.ఇలా నామినేషన్స్ ఇచ్చిన బిగ్ బాస్ సెలబ్రిటీ కపుల్ గా వెళ్లినటువంటి రోహిత్ మెరీనా దంపతులకు కూడా బిగ్ షాక్ ఇచ్చారు. కంటెస్టెంట్లు వీరిద్దరిని ఇద్దరిగా చూడకుండా ఒకటిగా చూడాలని, వీరిద్దరిలో ఎవరిని నామినేట్ చేసిన ఇద్దరినీ నామినేషన్ పరిగణలోకి తీసుకోబడుతుందంటూ షాక్ ఇచ్చారు.

Bigg Boss6: మెరీనా రోహిత్ ను ఒక్కటిగానే ట్రీట్ చేయాలి..

ఇలా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం వీరిద్దరిలో ఒక్కరు నామినేషన్ లో ఉండి ఎలిమినేట్ అయిన ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి బిగ్ బాస్ వీరిద్దరికి బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక మొదటివారం నామినేషన్ లో ఉన్నటువంటి ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది.