Bombay Padma : ఆంధ్రావాలా షూటింగ్ టైములో ఎన్టీఆర్ తో ఫోటో ఇప్పించమని వేణు మాధవ్ ని అడిగితే ఒసేయ్ అన్నాడు.. నేను ఒరేయ్ అన్నందుకు : పద్మ

Bombay Padma : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 పైగా సినిమాల్లో చేసి ఇంకా అంత గుర్తింపు లేకున్నా ఇప్పటికి ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్రయినా చేస్తూ అటు చాలా సీరియల్స్ చేస్తూ ఉన్న ఆర్టిస్ట్ బాంబే పద్మ గారు. పెళ్ళై పిల్లలు పుట్టాక ఒక సారి ప్రయత్నిద్ధాం అనుకుని సినిమాల్లోకి వచ్చిన పద్మ సినిమా పరిశ్రమలో ఎన్నో చేదు అనుభవాలను, అలాగే ప్రశంసలను అందుకున్నారు. భర్త బాధ్యత లేకుండా ఉంటే కుటుంబ బాధ్యతలను తీసుకుని అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే ఇటు కెరీర్ కోసం కష్టపడ్డారు పద్మ. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఎవరి సహాయం లేకుండా వచ్చిన బాంబే పద్మ ఇన్నేళ్లలో మొదటి సారి తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

వేణు మాధవ్ ఒసేయ్ అన్నందుకు ఒరేయ్ అన్నాను…

పూరి గారి ఆఫీస్ లో డైరెక్ట్ గా ఆయన దగ్గరకు వెళ్లొచ్చు. ఎలాంటి మధ్యవర్తిత్వాలు ఉండవు, అలా ఆయన్ని కలిసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే ఆయన చాలా ఓపిగ్గా నా మాటలు విని నాకు ఆయన సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ‘ఆంధ్రావాలా’ లో కూడా అవకాశం ఇచ్చారు. ఒకవేళ సినిమా హిట్ అయ్యుంటే ఖచ్చితంగా మంచి పేరు వచ్చుండేది. ఆ సినిమా షూటింగులో ఎన్టీఆర్ తో ఫోటో తీయించుకోవాలని డైరెక్ట్ గా అతన్నే వెళ్లి అడగడానికి భయపడి వేణు మాధవ్ ను అడిగాను. వేణి మాధవ్ తో అంతకుముందు ఒక సినిమాలో చేసిన పరిచయం ఉంది అయితే చనువు లేదు. ఇక ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఫోటో కావాలంట అని అడిగి నన్ను ‘ఒసేయ్ పద్మ రా’ అన్నాడు దాంతో నాకు కోపం వచ్చి వస్తున్నా రా అని అన్నాను. అందుకు నాలుగురోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. ఆ తరువాత వేణు మాధవ్ అడిగాడు ఎందుకు ఒరేయ్ అన్నావ్ అని అడిగితే నన్ను ఒసేయ్ అనేంత పరిచయం మన మధ్య లేనపుడు ఎందుకు అలా పిలిచావ్ అని అడిగాను, చిన్న గొడవే ఆ తరువాత మామూలే మళ్ళీ అంటూ చెప్పారు.

ఇక ఇలాంటి అనుభవమే బ్రహ్మానందం గారి దగ్గర కూడా అయిందంటూ చెప్పారు. ఏ బొంబాయి అని చలపతి గారు అంటారు. ఆయనతో నాకు పరిచయం ఉంది కనుక నాకు అభ్యంతరం లేదు కానీ బ్రహ్మానందం ఇంకా కొంతమంది నాకు పెద్దగా పరిచయం లేదు, వాళ్ళు అలా అనేసారికి నేను నా పేరు పద్మ ఆ పేరు తో పిలవండి బొంబాయి అని అనకండి అంటూ చెప్పాను. వాళ్ళ స్థాయి నాకు అప్పుడు తెలియదు. ఒక పొలం లో పెద్ద కూలీ చిన్న కూలీ లాంటిదే అనుకున్నాను కానీ అలా స్థాయిలు ఉంటాయని అప్పుడు నాకు తెలియదు, దానివల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను అంటూ చెప్పారు.