Siva jyothi: ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే పెద్ద ఎత్తున ఆ పండుగ రోజున సెలబ్రేట్ చేయడంలో మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు.ఇలా ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన ఈవెంట్లతో ప్రేక్షకులను సందడి చేస్తున్న మల్లెమాలవారు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను నవరాత్రి ధమాకా పేరుతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కంటెస్టెంట్లు హీరోయిన్స్ సంఘవి ప్రేమ వంటి తదితరులు హాజరయ్యి ఎంతో సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యతగా వ్యవహరించగా ఈ వేదికపై ఈయన గుమ్మడి గుమ్మాడి అనే పాటను పాడుతూ అందరిని ఎమోషనల్ గా టచ్ చేసారు.
ఇలా వేదికపై రవి పాట పాడటంతో అక్కడే ఉన్నటువంటి శివ జ్యోతి కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.అనంతరం ఈమె వేదిక పైకి వెళ్తూ తన నాన్నని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ
ఊరికెళ్లితే.. మా నాగంపేట్ మొత్తం డాక్టర్ మల్లేష్ బిడ్డా అంటారు అంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ వేదికపై పెద్ద ఎత్తున కంటెస్టెంట్లు తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారం చేయనున్నారు. ఇక హైపర్ ఆది యధావిధిగా కంటెస్టెంట్లపై తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ అందరిని సందడి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…