Category Archives: Health News

Omicron: ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

Omicron: రోజు రోజుకి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిలో విజృంభిస్తోంది . ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచమంతట శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా ఇతర వేరియంట్ లతో పోల్చితే ఒమిక్రాన్ పిల్లల్లో తొందరగా వ్యాప్తి చెందుతోంది . ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాలను పాటించండి .

Omicron: ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

మనం తీసుకుని ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది . అందువల్ల శరీరారోగ్యానికి అవసరమైన పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది . విటమిన్ డి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . అందువల్ల విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ వ్యాధినిరోధక పెంచు కోవడం వల్ల ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు . ప్రతిరోజు ఉదయం వచ్చే సూర్యకిరణాల ద్వారం మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.. అందువల్ల ప్రతిరోజు ఉదయం కాసేపు ఎండలో తిరగటం మంచిది .

Omicron: ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

మన ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో తగిన సమయం నిద్రపోవడం కూడా అవసరం . ప్రతి మనిషి రోజుకు 6-8 గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలి . ఇలా కాకుండా పని ఒత్తిడిలో పడి సమయానికి నిద్రపోకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు తగు సమయం నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి .

ప్రతి రోజు వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యానికి అందానికి చాలా మంచిది . ప్రతి రోజు వాకింగ్ , రన్నింగ్ సైక్లింగ్ వంటి చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెరుగుతుంది. అలాగే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న పసుపు ,తేనె నిమ్మరసం , తులసి, పుదీనా వంటి వాటిని ప్రతిరోజు తీసుకోవటం మంచిది.

తరచూ నీరు తాగుతూ ఉండాలి..

ప్రతిరోజు యోగ చేయటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు . ప్రతిరోజు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయటం వల్ల శరీరానికి ఆక్సిజన్ బాగా అంది శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే ప్రతి నిత్యం మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా తరచూ నీరు తాగుతూ ఉండాలి. కరోనా వ్యాపించకుండా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలి. చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ శానిటైజర్ ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటంవల్ల కరోనా దరిచేరకుండా ఉంటుంది .

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

Black Dots Banana: కూరగాయలు ,పండ్లు , తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఒక యాపిల్ పండు తినటం వల్ల డాక్టర్ ను కలవాల్సిన అవసరం రాదు.రోజుకో యపిల్ మాత్రమే కాదు రోజుకో అరటిపండు తినటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండచ్చు.అరటిపండ్లు ప్రతినిత్యం అతి తక్కువ ధరలో మన అందరికీ అందుబాటులో ఉండే పండ్లు. అరటి పండ్లు బాగా పండటం వల్ల వాటి మీద నల్ల మచ్చలు వచ్చినఅరటి పండును తినడానికి చాలా మంది ఇష్టపడరు అయితే ఇవి రుచి చాలా బాగుంటాయి . ఈ నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

అరటి పండ్లు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. బాగా పండిన అరటిపండు తినటం వల్ల అరటిపండులో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ క్యాన్సర్ ట్యూమర్ లపై దాడి చేసి క్యాన్సర్ సమస్య నుండి విముక్తి కలిగిస్తాయి.

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల అరటి పండులో ఉండే పొటాషియం, సోడియం రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి రక్తపోటు సమస్య నుండి విముక్తినిస్తుంది. అరటి పండు తినటం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా నివారించవచ్చు.

నెలసరి సమస్యల నుంచి విముక్తి:

అరటి పళ్లలో విటమిన్ B6 ఉంటుంది. ఇది మహిళలకు నెల నెల వచ్చే రుతుక్రమ సమస్యల నుండి కాపాడుతుంది. రోజు శ్రమించే వారు, క్రీడలు ఆడేవారు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. ఇలాంటి వారు తక్షణ శక్తి కోసం అరటి పళ్ళను తినడం ద్వారా ఉత్తేజం అవుతారు. అల్సర్ లాంటి సమస్యలు ఉన్నవారు కూడా బాగా పండిన అరటి పళ్ళను తినడం ద్వారా వారు ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

Lemon Tea: లెమన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే .. అస్సలోదలరు!

Lemon Tea: ఉదయం లేవగానే టీ తాగకపోతే చాలా మందికి రోజు గడవదు. టీ తాగడం వల్ల మెదడు ఆక్టివ్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం వల్ల గ్రీన్ టీ , లెమన్ టీ , బ్లాక్ టీ వంటి వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి లెమన్ టీ ఎంతో ఉపయోగపడుతుంది. లెమన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

Lemon Tea: లెమన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే .. అస్సలోదలరు!

ప్రతిరోజు ఉదయం లెమన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన శీతాకాలంలో వచ్చే జలుబు , దగ్గు , గొంతు నొప్పి వంటి వాటికి చెక్ పెట్టవచ్చు. లెమన్ టీ తయారుచేయటానికి నీటిని బాగా మరిగించి టీ పౌడర్ వేసి ఉడకనివ్వాలి.. తర్వాత అందులో నిమ్మరసం లేదా నిమ్మకాయ స్లైసెస్ వేసి బాగా మరిగించిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి కడుపు ఉబ్బరం , గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

Lemon Tea: లెమన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే .. అస్సలోదలరు!

అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా లెమన్ టీ తాగడం వల్ల వారి సమస్యను దూరం చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం లెమన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది. లెమన్ టీ చర్మ సమస్యలను దూరం చేయడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు:

నిమ్మరసంలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి కూడా రక్షణ పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం లెమన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా లెమన్ టీ తాగడం వల్ల అందం , ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 200పైగా కేసులు నమోదు..మూడో స్థానంలో తెలంగాణ..!

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మరోసారి విరుచుకుపడుతోంది. కరోనా రెండు వేవ్ ల్లో ఎంతో మంది ఇబ్బందుకు గురికాగా.. మరికొంత మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక తాజాగా తన వేరియంట్ ను మార్చుకొని ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడుతోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఈ కేసులు మన తెలంగాణలో కూడా నమోదవుతున్నాయి. ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదొక జిల్లాలో ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది.

వెంటనే ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వైద్యసేవల కోసం హైదరాబాద్‌ తరలించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. జిల్లాకు యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఎవరూ ఆందోళన చెందకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

మొత్తం రెండు రోజుల కిందటి వరకు 150గా నమోదైన ఈ కేసుల సంఖ్య ఇప్పుడు 200కు చేరింది. 48 గంటల వ్యవధిలో 50 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయంటే.. ఈ వేరియంట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా మహారాష్ట్రలో 54 కేసులు నమోదు కాగా.. ఢిల్లీల మరో 54 కేసులు నమోదయ్యి.. తెలంగాణలో 20 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద తెలంగాణ ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 19 కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతల బయపెట్టిందో అందరికీ తెలుసు. గత ఏడాదిలో విజృంభించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.

కోవిడ్-19 యొక్క వేరియంట్ లలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్ ఇదే అని “డబ్లూహెచ్‌ఓ” డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథ్నోమ్ ఘ్యాబ్రియోసిస్ చెప్పారు. ఈ మేరకు డబ్లూహెచ్ఓ సభ్య దేశాలన్నింటిని అలర్ట్ చేసింది. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.

కోవిడ్-19 లేదు.. కరోనా తగ్గిపోయింది అని ఎవరికి వాళ్ళు హీరోల లాగా నార్మల్ గా జీవనం సాగిస్తున్నారు, కానీ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోన్న ప్రకారం, ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది, ఇక నుండి అందరూ కరోనా వాక్సిన్ ల మీద మాత్రమే ఆధారపడకుండా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ లు వాడటం, మాస్కులు ధరించడం తప్పక చేయాలని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ 77 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం చాలానే ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్ లో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇతర ముందు జాగ్రత చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని కోరింది. ఒమిక్రాన్ ని తేలికగా తీసుకొని జాగ్రతలు పాటించకపోతే ప్రపంచ దేశాలు భారీమూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే కొన్ని దేశాలు 2 డోసుల వ్యాక్సిన్ తో పాటుగా ఒమిక్రాన్ ని ఎదుర్కొనటానికి బూస్టర్ డోసులని వేయడానికి సన్నద్దం చేశారు.

20 సంవత్సరాల తరువాత వచ్చే ఆల్జీమర్స్ వ్యాధిని ముందుగానే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసా?

అల్జీమర్స్ వ్యాధి అంటే అదేదో పెద్ద వ్యాధి అని భయపడకండి. కరెక్ట్ గా మన భాషలో మాట్లాడుకుంటే మతిమరుపు అంటారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనినే చిత్త వైకల్యం అంటారు. మతిమరపు మనుషులకి సర్వ సాధారణం, కానీ ఈ వ్యాధి ప్రభావం ఉన్నవాళ్లు రోజు వారి కార్యకలాపాలు, ప్రదేశాలు, నిన్న మొన్న కలసిన వ్యక్తులను మరచిపోవడం వంటివి కూడా మరచిపోతారు.

మానవ మెదడులో వచ్చే వ్యాధులలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధిని 20 సంవత్సరాల ముందే గుర్తించవచ్చు అని నిపుణులు అధ్యయనం చేశారు. అల్జీమర్స్ వ్యాధి 30 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులలో ప్రారంభం అవుతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది.మన మెదడులో హైపర్ యాక్టివేషన్ సింప్టంస్ అల్జీమర్స్ వ్యాధికి సంకేతం అని కొన్ని రీసెర్చ్ లు చెప్తున్నాయి. మతిమరపు ఉన్నప్పటికీ అల్జీమర్స్ ఉన్నట్టు నిర్దారణ కానీ వారిలోని కొన్ని మెదడు భాగాలు హైపర్ ఆక్టివ్ లో ఉంటున్నాయి అని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేనడలోని యూనివర్సిటీ ఆఫ్ డి మాoట్రియల్ పనిచేస్తున్న ఒక అధ్యయన శాస్త్రవేత్త సిల్వీ బెల్లేవిల్లే (Sylvie Belleville) గారు చెప్పిన ప్రకారము ఈ వ్యాధిని 20 నుండి 30 సంవత్సరాల ముందే మెదడు లోని మార్పులని బట్టి గుర్తించ వచ్చును అని చెప్పారు. మెదడులో చోటు చేసుకునే హైపర్ యాక్టివేషన్ సమస్యను ఈ వ్యాధికి ఫస్ట్ స్టేజ్ గా భావించవచ్చు అని తెలిపారు.ఈ అధ్యయనాన్ని అల్జీమర్స్ అండ్ డిమెన్షియా: డయాగ్నోసిస్, అసెస్మెంట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ అనే జర్నల్ లో ప్రచురించారు. అధ్యయనం కోసం early identification of Alzheimer’s Disease Consortium డేటాను బేస్ చేసుకున్నారు. MRI స్కాన్ చేసిన తర్వాత మతిమరపు సమస్యలు బయటపడి, అల్జీమర్స్ వ్యాధి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందొ వారి మెదడు యాక్టివేషన్ కెపాసిటీ ని వీరు అధ్యయనం చేశారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిన్న వయసులో ప్రారంభం అయ్యే అల్జీమర్స్ రకం ఎక్కువగా జన్యుపరమైన ప్రభావంతో ఉంటుంది, ఇది అరుదుగా ఉటుంది. అయితే వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ రకం జన్యుపరమైన, లైఫ్ స్టైల్ ఆండ్ పర్యావరణ కారకాల మిశ్రమం కారణంగా ఉంటుంది.
కొన్ని జాగ్రత్తలు తేసుకోడం వల్ల అల్జీమర్స్ ని త్వరగా గుర్తించి సమస్యకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. పడుకునే ముందు ఈ చిన్న పనులు చేస్తే చాలు!

ఈ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువగా అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావడం వల్ల అధిక బరువు సమస్య ఎక్కువ అవుతోంది. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం ఇందుకు కారణం.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్స్ ,జంక్ ఫుడ్ తినటానికి మొగ్గుచూపుతున్నారు. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్థూలకాయం సమస్య వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం చాలామంది జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయడం, డైట్ ను ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మనం అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదనలో పడి సమయానికి తినకుండా రాత్రి ఎప్పుడో 10, 11 గంటలకి భోజనం చేయడం అలవాటుగా మారిపోయింది.అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట అన్నం తినకుండా చపాతీలు పండ్లు వంటివి తీసుకుంటారు. అయితే మీరు పాటిస్తున్న పద్ధతి సరైనదేనా ఆహారం వెంటనే నిద్ర పోకూడదు . అలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత ఒక అర గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. ద్వారా బరువు సమస్య పెరగకుండా ఉంటుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారు రాత్రివేళ భోజనంలో పిండి పదార్థాలు తీసుకోవడానికి బదులు సలాడ్, సూపర్, పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రమే లభిస్తాయి.

రాత్రివేళ నిద్రపోయే ముందు భోజనానికి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగటం బల్ల అధిక బరువు సమస్యను నిర్మూలించవచ్చు. పాలలో అనేక రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల రాత్రివేళ భోజనం చేయడానికి బదులు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి లభించే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

చాలామందికి రాత్రివేళ భోజనం చేసే సమయంలో స్నాక్స్ తినటం అలవాటుగా ఉంటుంది. అలా చేయటం చాలా ప్రమాదం. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు ఇంకా పేరుకుపోయి సమస్య తీవ్రత పెరుగుతుంది. కావున ఈ సమస్యతో బాధపడే వారు రాత్రివేళ నిద్రపోయే ముందు ఇటువంటి పొరపాట్లు చేయకపోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కొత్తిమీర కాడలు పడేస్తున్నారా.. అయితే మీరు చాలా నష్టపోయినట్లే!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరలు మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం కొత్తిమీర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొత్తిమిర అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. కొత్తిమీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కానీ కొంతమంది కొత్తిమీర ఆకులను మాత్రమే వాడుకొని కాడలు పనికి రావని వాటిని పడేస్తుంటారు. అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. వాటివల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొత్తిమీర‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. కొత్తిమీర‌లో పోష‌కాలు, ఔష‌ధ విలువ‌లు అనేకం. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కొత్తిమీర మన శరీరంలో రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు ఉదయమే కొద్దిగా పచ్చి కొత్తిమీరను కడిగి తినటం వల్ల షుగర్ వ్యాధి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర వల్ల కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి.

కొత్తిమీరలో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తాయి. జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్దకం, క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతాయి. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా తోడ్పడుతుంది. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిస్తుంది.కనుక కొత్తిమీర కాడలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక వీటిని పడేస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు.

దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నారా.. జాగ్రత్త ఇది ఆ వ్యాధి కావొచ్చు..?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యం బాగుంటే ఎప్పుడైనా ఏ పని అయినా చేసుకోవచ్చు. ప్రస్తుత వేసవి కాలం, శీతాకాలం అంటూ సంబంధం లేకుండా ఎన్నోరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు మరి తొందరగా వ్యాపిస్తున్నాయి. దగ్గు, జలుబు, వాంతులు, జ్వరం వంటివి శీతాకాలంలో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలు. చాలామంది ఇది వాటిని చాలా తేలికగా తీసుకుంటూ మందులు వాడుతూ ఉంటారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం మనం తెలుసుకుందాం.

సాధారణంగా జలుబు ,దగ్గు తొందరగా నయం కావు. ప్రతిరోజు మందులు వాడిన తగ్గని దగ్గు,జలుబు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే భయపడాల్సిన వస్తుంది. జలుబు,దగ్గు విపరీతంగా ఉండి ఎన్ని రోజులకి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించటం శ్రేయస్కరం.

జలుబు ఎన్ని రోజులకి తగ్గకపోతే అది న్యూమోనియా గా మారే ప్రమాదం ఉంది. అలాగే దగ్గు మరి ఎక్కువగా ఉంది చాలా రోజుల వరకు తగ్గకపోతే చాలా ప్రమాదం. 4 లేదా5 వారాలు విడువకుండా దగ్గు ఉంటే అది “టి-బి”గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దగ్గు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం.

ప్రస్తుత కాలంలో వాహనాలు పెరిగి చెట్ల పెంపకం తగ్గిపోయింది. అందువల్ల వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ గాలి మనం పీల్చు కోవడం ద్వారా ఎన్నో రకాల శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అవ్వటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందువలన వీలైనంత వరకు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉండకపోవడమే మంచిది.

ఎండు ద్రాక్ష వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు ద్రాక్ష వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఐదు లేదా ఆరు డైరెక్ట్ గా తినటం తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. ఎండు ద్రాక్ష ఎన్నో రకాల పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. ఎండుద్రాక్షలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది.
ఎండు ద్రాక్షను ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతుంది. బ్లడ్ ప్రెజర్ ను అదుపు చేయవచ్చు.

ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినటం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు కూడా దూరం చేయవచ్చు. స్త్రీలు ఎండు ద్రాక్షను తినటం వల్ల నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రతిరోజు చిన్న పిల్లలకు 4 లేదా 5 ఎండుద్రాక్షలు తినిపించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రివేళ నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉన్న పిల్లలకి పది రోజులు 3 లేదా 4 ఎండు ద్రాక్షను తినిపించడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు. ప్రపంచం మొత్తంలో సంవత్సరానికి 60 నుండి 70శాతం ద్రాక్షను ఎండబెట్టి వైన్ తయారీ విధానంలో ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు.