Category Archives: Movie News

Suman: పవన్ భార్యల గురించి మీకెందుకు… రోజా గురించి నాకు తెలుసు.. సుమన్ కామెంట్స్ వైరల్!

Suman: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సుమన్ ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగానికి చాలా మంచి అనుబంధంగా ఉందని తెలిపారు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలో రాజకీయాలలో ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఈ విధంగా సినిమా సెలబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లినప్పుడు వారిని రాజకీయంగా ప్రశ్నించాలి కానీ వ్యక్తిగతంగా ప్రశ్నలు వేయకూడదు అలాగే విమర్శలు చేయకూడదు కానీ ఇటీవల కాలంలో రాజకీయాలు అంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడమే రాజకీయంగా మారిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నుఇటీవల ఎంతో మంది వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.

ఆయన ముగ్గురు పెళ్ళాలని చేసుకున్నారంటూ విమర్శించారు ఆయన ముగ్గురిని చేసుకుంటే మీకేంటి 30 మందిని చేసుకుంటే మీకేంటి వాళ్ళు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే ఏదైనా సాయం అడిగారా? ఇలా వ్యక్తిగత విమర్శలు తగవని ఈయన తెలిపారు అలాగే రోజా గురించి కూడా మాట్లాడారు.

ఎంతో కాంప్రమైజ్ కావాలి..
ఒక ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎంతో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రోజా గురించి కూడా చాలామంది కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం చాలా బాధ కలిగించిందని సుమన్ తెలిపారు. ఆవిడ బోల్డ్ గా మాట్లాడుతుంది. అందరిలా సైలెంట్ గా ఉండాలంటే ఎలా? మహిళలను గౌరవించాలి. అన్ని పార్టీల వారికి అదే వర్తిస్తుందని ఈ సందర్భంగా సుమంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Renu Desai: నా మాజీ భర్తను తిరిగి పొందడం ఎలా…రేణు దేశాయ్ పోస్ట్ వైరల్!

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భారీగా సినీ నటిగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.

ఇక రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఈమె సినిమాలలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తన వెంటే ఉంటూ బాగా హైలైట్ అయ్యారు. ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇక ఈమె పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఈమెను ఇంకా వదిన అంటూ పిలుస్తూనే ఉన్నారు. వదిన అని పిలవడం వరకు ఓకే కానీ కొంతమంది మాత్రం తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా తనకు సలహాలు ఇచ్చే వారి గురించి ఈమె మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఉచిత సలహాలు ఇవ్వకండి..
ఈ క్రమంలో ఒక వీడియోని షేర్ చేసిన ఈమె ఈ వీడియోని తాను డిసెంబర్ లోనే ఎడిట్ చేశానని అయితే షేర్ చేయడం మర్చిపోయానంటూ షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన ఈమె నెటిజన్లకు, పవన్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చింది. నా మాజీ భర్తని తిరిగి పొందడం ఎలా .. అతనిని నేను మిస్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి పోస్ట్ లు చేస్తోంది అని మీరు భావిస్తూ..అనవసరమైన సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Klin Kaara: క్లీన్ కారా మొదటి పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఉపాసన!

Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా అప్పుడే ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు. గత ఏడాది జూన్ 20 తేదీ మెగా ప్రిన్సెస్ జన్మించడంతో మెగా అభిమానులు కుటుంబ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ చిన్నారి నేడు తన మొదటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన కూతురి పుట్టిన రోజు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో.. చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉంది. తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా క్లీన్ కార తన జీవితంలోకి రావడంతో తన జీవితం పరిపూర్ణమైంది అంటూ తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుత ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ చిన్నారి జన్మించి ఏడాది అవుతున్న ఇప్పటివరకు తన ఫేస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం అభిమానులకు చూపించలేదు.

జీవితం పరిపూర్ణం..
ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడ తన ఫేస్ క్లియర్ గా కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడుతూ వచ్చారు.. అయితే ఈమె ఫేస్ కనిపించినప్పటికీ క్లియర్ గా కనిపించకపోవడంతో అభిమానులు మెగా ప్రిన్సెస్ ని ఎప్పుడు చూపిస్తారు అంటూ పోస్టులు కూడా పెడుతుంటారు. మరి తన పుట్టినరోజు సందర్భంగా నైనా క్లీన్ కారా ఫేస్ రివీల్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/reel/C8aRY5BSlnw/?utm_source=ig_embed&ig_rid=c67fa9c8-0f8c-4538-be20-ee2a2c3c4b94

Sri Reddy: చిరంజీవి మాజీ అల్లుడు మృతి పై శ్రీ రెడ్డి షాకింగ్ పోస్ట్.. శాంతి దొరికిందంటూ?

Sri Reddy: చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. శ్రీజ శిరీష్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా వీరిద్దరూ 2007వ సంవత్సరంలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.

కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ ఒక పాప జన్మించిన తర్వాత 2014వ సంవత్సరంలో తన భర్త శిరీష్ భరద్వాజకు విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు వచ్చారు. అనంతరం ఈమె 2016వ సంవత్సరంలో కళ్యాణ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇక శిరీష్ సైతం 2019 లో మరొక వివాహం చేసుకున్నారు.

ఇలా రెండో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధి సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈయన మరణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సంచలన తారా శ్రీరెడ్డి శిరీష్ మరణం పై స్పందించారు.

అందరూ మోసం చేశారు..
శిరీష్ మరణ వార్త గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన సంచలనంగా మారుతూ ఉంటాయని మనకు తెలిసిందే.

Parabhas: నా కడుపుకు ప్రభాస్ కారణం… బాంబ్ బ్లాస్ట్ చేసిన దీపిక పదుకొనే?

Parabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈ సినిమా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ అమితాబ్ ప్రభాస్ రానా దీపిక వంటి సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దీపికా పదుకొనే బేబీ బంప్ తో కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దీపిక మాట్లాడుతూ నా కడుపుకు కారణం ప్రభాస్ అంటూ బాంబ్ పేల్చారు. అయితే తాను పెట్టిన ఫుడ్డు తినే ఇలా అయ్యానంటూ ఈమె కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

ప్రభాస్ ఎక్కడుంటే అక్కడ ఫుడ్ కి ఏమాత్రం కొదువ ఉండదు వారికి నచ్చిన ఆహార పదార్థాలు అక్కడ ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కల్కి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తన ఇంటి నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చే వారని అవి చాలా రుచికరంగా ఉండేవి వాటిని తినడం వల్ల నేను ఇలా తయారయ్యాను అంటూ దీపిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రుచికరమైన భోజనం..
ఇక ప్రభాస్ ఏ సినిమా షూటింగ్లో ఉన్న అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇష్టమైన ఆహార పదార్థాలను తెప్పించి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తెలియజేశారు. అయితే తాజాగా ఈమె కూడా ప్రభాస్ పంపిన ఫుడ్ తినడం వల్ల ఇలా తయారయ్యానంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Venu Swamy: మీ ట్రోల్స్ కారణంగా నేను బిజీ అయ్యాను.. ట్రోల్లర్స్ కు కౌంటర్ ఇచ్చిన వేణు స్వామి!

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఒకప్పుడు కేవలం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండే ఈయన ఇటీవల కాలంలో సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.

ఇప్పటివరకు వేణు స్వామి చెప్పిన జాతకాలు దాదాపు నిజమయ్యాయి. కానీ ఇటీవల వరుసగా ఈయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పిన వేణు స్వామి జాతకం నిజం కాకపోవడంతో ఎంతో మంది ఈయనపై విమర్శలు చేశారు.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో వేణు స్వామి ఈ విషయంపై స్పందిస్తూ తాను చెప్పిన జాతకం తప్పయింది నేను ఒప్పుకుంటున్నాను ఇకపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను ఇలా బహిరంగంగా చెప్పనంటూ ఒక వీడియోని విడుదల చేశారు.

ఇలా వీడియో విడుదల చేసినప్పటికీ ఈయనపై ట్రోల్స్ ఏమాత్రం ఆగడం లేదు అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై వేణు స్వామి స్పందించారు. నేను తప్పును ఒప్పుకున్నా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ కారణంగా నేను భయపడనని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన నాకు ట్రోల్స్ పెద్ద సమస్య కాదని తెలిపారు. అయినా మీ ట్రోల్స్ కారణంగా నేను చాలా బిజీగా మారిపోయాను. ఎక్కువ పని కలుగుతుంది.
తప్పు ఒప్పుకున్నా…

ఇలా నాపై ట్రోల్స్ చేసేవారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వారందరూ కూడా మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి ట్రోలర్స్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Deepika Padukone: కల్కి ఈవెంట్ లో బేబీ బంప్ తో సందడి చేసిన దీపిక.. ప్రభాస్ చేసిన పనికి ఫిదా?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈమె నటించిన కల్కి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేశారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దీపికా పదుకొనే హాజరయ్యారు.

మొదటిసారి ప్రెగ్నెన్సీ తర్వాత బయట కనిపించడంతో పెద్ద ఎత్తున ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఈమె బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ ధరించారు ఇందులో ఈమె బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె కల్కి లాంటి ఒక గొప్ప సినిమాలో నటించే అవకాశం తనుకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ కార్యక్రమం అనంతరం దీపికా పదుకొనే స్టేజ్ పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో ప్రభాస్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. బేబీ బంప్ తో ఉన్నటువంటి ఈమె స్టేజ్ దిగుతున్న సమయంలో పక్కనే ఉన్న ప్రభాస్ లేచి వచ్చి ఆమె కిందికి దిగడానికి సహాయంగా తన చేయి ఇచ్చి తనని ఎంతో జాగ్రత్తగా కిందికి దింపారు.

దీపికకు సాయంగా..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అది కదా మా డార్లింగ్ అంటే అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇలా ప్రభాస్ దీపికాకు సాయంగా నిలవడంతో తనలో ఉన్న మంచితనం మరోసారి బయటపడటంతో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mahesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్… అభిమాని పిల్లలకు అండగా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు ఎన్నో రకాల వ్యాపారాలను కూడా చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు. ఇక మహేష్ బాబు సంపాదనలో కొంత భాగం పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే మహేష్ బాబు తన తండ్రి సొంత ఊరు అయిన బుర్రెపాలెం దత్తత తీసుకొని ఆ గ్రామంలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే పునర్జన్మ కల్పిస్తున్నారు.

ఇలా ఇప్పటికే మహేష్ బాబు తన పౌండేషన్ ద్వారా ఎంతో మందికి అండగా నిలిచి తన మంచి మనసు చాటుకున్నారు. అయితే తాజాగా తన వీరాభిమాని పిల్లలకు కూడా అండగా నిలిచి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి మహేష్ బాబు సినిమా పేర్లు అయిన అర్జున్, అతిథి, ఆగడు అనే పేర్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

మహేష్ సినిమా పేర్లే..
ఇకపోతే రాజేష్ ఇటీవల కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దీనికి తన పిల్లలు చదువుకోలేక ఇతర పనులకు వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీం రాజేష్ ఇంటికి చేరుకొని ఆ పిల్లల చదువు బాధ్యతలను తీసుకొని వారిని చదివిస్తున్నారు. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss: బిగ్ బాస్ వల్ల ఆ సమస్య నుంచి బయటపడ్డాను..వరుణ్ సందేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Bigg Boss: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇప్పటివరకు 7 సీజన్ లు పూర్తి అయ్యాయి. ఇకపోతే త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియా స్టార్స్ అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అయిన వరుణ్ సందేశ్ వితిక దంపతులు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో వీరు సుమారు 10 వారాలకు పైగా కంటెస్టెంట్లుగా కొనసాగారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

వరుణ్ సందేశ్ నటించిన నింద అనే సినిమా జూన్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈయనకు బిగ్ బాస్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన మీకు ఈ కార్యక్రమం ఎలా ప్లస్ అయింది అంటూ ప్రశ్నించారు.

ఆర్థిక ఇబ్బందులు..
ఈ ప్రశ్నకు వరుణ్ సందేశ్ సమాధానం చెబుతూ ఈ కార్యక్రమం నా రీ ఎంట్రీకి ప్లస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో నేను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేవాడిని ఈ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత ఫైనాన్షియల్ గా నేను సెటిల్ అయ్యానని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pushpa 2: పుష్ప 2 వాయిదా.. కోర్టుకు వెళ్తాను అన్న అభిమాని.. జోక్ గా ఉందంటూ?

Pushpa 2: అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీ విడుదల కావాల్సింది కాస్త వాయిదా పడి డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా పుష్ప 2 వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ ఈ సినిమా వాయిదా గురించి క్లారిటీ ఇచ్చారు.

ఆగస్టు 15వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6 తేదీ రాబోతుందని మేకర్స్ తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. ఇక ఈ పోస్టుపై ఒక అభిమాని స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్ప 2 విడుదల వాయిదా గురించి స్పందిస్తూ చాలా జోక్ గా ఉందా తమాషా చేస్తున్నారు. పుష్ప సినిమా 2024 జూలైలోనే విడుదల కాబోతుందని తెలిపారు. తిరిగి ఆగస్టుకి మార్చారు. ఇప్పుడు డిసెంబర్ 6 తేదీ విడుదల కాబోతుందని తెలుపుతున్నారు. ఫ్యాన్స్ ఎమోషన్ తో ఆడుకుంటున్నారా పుష్ప టీం మొత్తం పై కోర్టుకు వెళ్తాను అంటూ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

అదనపు భారం..
నిజానికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పనుల నిమిత్తం వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ఇంకా కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేయాల్సి ఉండగా మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేసారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా వాయిదా వేయడంతో నిర్మాతలకు సుమారు 40 కోట్ల వరకు అదనపు బారం పడుతుందని సమాచారం.