Kirak RP: కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పీ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు..
ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్న ఆర్పీ మల్లెమాల సంస్థ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కనీసం అక్కడ ఉండే ఆర్టిస్టులకు మల్లెమాలవారు కడుపునిండా కూడా అన్నం పెట్టేవారు కాదు అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే ఈ విమర్శల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ నటుడు బాబు మోహన్ స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ఆర్పీ నువ్వు జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు నువ్వు ఎంత నీ బ్రతుకెంత.. పొట్టకూటి కోసమే కదా నువ్వు ఈ కార్యక్రమంలోకి వచ్చావు ఈ కార్యక్రమంలో పాల్గొని కాస్త పేరు ప్రఖ్యాతలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మల్లెమాల అంటే ఎవరు చిత్ర సీమకే ఓకే తండ్రి MS రెడ్డి గారు. జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది.
పొట్టకూటి కోసమే కదా..
ఆ సంస్థపై ఆరోపణలు చేయటానికి కొంచమైనా సిగ్గు లేదా. అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటే రేపు పొద్దున తినడానికి అన్నం కూడా దొరకదు. నేను కూడా ఒకప్పుడు ఈ సంస్థలో పనిచేసే నేడు ఈ స్థాయికి వచ్చిన వాడిని. నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన సమస్థ మల్లెమాల వారే అంటూ బాబు మోహన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…