Upasana: అత్తమామల ప్రవర్తన పై కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన… ఇన్నాళ్లకు బయటపెట్టిన మెగా కోడలు?

Upasan: మెగా కోడలు ఉపాసన అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె రామ్ చరణ్ భార్యగా,మెగా ఇంటి కోడలుగా మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని కూడా చక్కదిద్దుతూ బిజినెస్ ఉమెన్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక ఉపాసన తన వృత్తిపరమైన విషయాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు.

Advertisement

తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పెళ్ళికి ముందు తన గురించి వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లికి ముందు నేను కాస్త బొద్దుగా ఉండే దాన్ని దీంతో తన చుట్టూ ఉండేవారు తనని ఎన్నో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల నేను కాస్త బాధపడ్డాను కానీ వాటిని నా మనసు వరకు తీసుకువెళ్లలేదు. మన చుట్టూ ఉన్న వందల మంది మాట్లాడే మాటలను మనం పట్టించుకుంటే చాలా కష్టం. మనల్ని ప్రేమించేవారు మాట్లాడినప్పుడే మనం వాటి గురించి ఆలోచించాలని తెలిపారు.. ఇక పెళ్లి తర్వాత కూడా నా గురించి ఎన్నో కామెంట్లు వచ్చాయి కానీ అత్తయ్య మామయ్య ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

చాలా కేర్ తీసుకుంటారు..

నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు నన్ను చూసుకున్నారు నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు. కొన్నిసార్లు చరణ్ అత్తయ్య మామయ్య చూపించే ప్రేమకు నాకు కన్నీళ్లు వస్తుంటాయి. వారు అంత ప్రేమను చూపిస్తారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా తన అత్తమామల గురించి భర్త చూపించే ప్రేమ గురించి ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement

Advertisement
lakshana: Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.