Chiranjeevi: “ఆయన ఒక లెజెండ్..” చిరు-గరికపాటి వివాదంపై మంచు విష్ణు కామెంట్స్.. ఏమన్నాడంటే?

Chiranjeevi:  తెలుగులో మన పురాణాలను, ఇతిహాసాలను, చరిత్రను ఎంతో అద్భుతంగా చెబుతూ.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రవచన కర్త గరికపాటి గారు. గత కొద్దిరోజులుగా గరికపాటి చుట్టూ ఈ మధ్యన వివాదం సాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన గరికపాటి.. అదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదానికి తెర తీశాయి.

అలయ్ బయట్ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి.. అక్కడున్న వారితో ఫోటోలు దిగుతుండగా.. చిరంజీవి ఫోటోలు దిగడం ఆపాలని, అప్పుడే తాను ప్రసంగం మొదలుపెడతానని గరికపాటి చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ గరికపాటి మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. గరికపాటి పాత వీడియోలను పోస్ట్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెట్టారు.

దీని మీద ఇప్పటి వరకు మెగా అభిమానులు స్పందించారు, ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి రాంగోపాల్ వర్మ.. పరోక్షంగా స్పందించారు. కాగా తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన మంచు విష్ణు ఈ అంశం మీద స్పందించారు. గరికపాటి – చిరంజీవిల మధ్య నడిచిన వివాదం గురించి మాట్లాడుతూ.. చిరంజీవికి సపోర్ట్ చేయడంతో పాటు, పరిస్థితులే అలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

Chiranjeevi:

గరికపాటి-చిరు వివాదంపై మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్టుగా తెలీదు, గరికపాటి గారు ఏదో మాట్లాడారు. చిరంజీవి ఫ్యాన్స్ .. అదీ ఇదీ అని! పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనతో ఫోటో తీసుకోవడమనేది అభిమానులకు సువర్ణావకాశం. ఆయన దగ్గరకు ఎవరైనా సరే పరుగెత్తుకు వెళ్లి ఫోటో తీసుకుంటారు. ఆ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎక్సైట్మెంట్ లో ఉంటారు’ అని అన్నాడు.