Movie News

Big Boss: బిగ్ బాస్ హౌజ్ నుండి సుదీప ఔట్.. కారణం ఇదే!

Big Boss: తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించిన రియాల్టీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటి వరకు ప్రసారమైన ఐదు సీజన్లు ఎంతో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను అలరించగా.. ఆరో సీజన్ కూడా అదే రీతిలో అలరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తాజా సీజన్ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు ఇంట్రస్టింగ్ గా అనిపించడం లేదు.

బిగ్ బాస్ సీజన్ 6కు ఆదరణ చాలా తక్కువ ఉందనే విషయాన్ని టీఆర్పీలు కూడా నిరూపించాయి. గత సీజన్ తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ని నమోదు చేసుకోవడం.. అందరికీ నిరాశను గురి చేస్తోంది. అయితే దీనికి కారణం బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్లు ఆడుతున్న గేం.

కంటెస్టెంట్లు ఏదో బిగ్ బాస్ హౌజ్ లో కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే పెద్దగా ఆడటం లేదనేది జనాల టాక్. ఇలాంటి కంటెస్టెంట్ల జాబితాలో పింకీ అలియాస్ సుదీప కూడా ఒకరు. సినిమాలు చేసిన అనుభవం, తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి అవడంతో.. అందరూ సుదీప బిగ్ బాస్ లో అదరగొట్టాలని, బాగా ఆడుతుందని ఆశించారు.

Big Boss:

కానీ సుదీప మాత్రం బిగ్ బాస్ లో ఏమాత్రం తన ఆటతీరును ప్రదర్శించలేదు. చూస్తున్న జనాలకు కూడా సుదీప ఆటతీరు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ఆమెను బయటకు పంపించేయండి అంటూ డిమాండ్ చేశారు. నిజానికి గత రెండు మూడు వారాల క్రితమే సుదీప బిగ్ బాస్ నుండి బయటకు పోవాల్సి ఉండగా.. తాజా ఎలిమినేషన్ లో ఆమె బయటకు వెళ్లిందని టాక్. ఆమె ఆటతీరు బాగోలేకపోతే ఎవరు మాత్రం ఏమీ చేయలేరంటూ నెటిజన్లు.. సుదీప ఎలిమినేషన్ మీద కామెంట్లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago