Chiranjeevi: తెలుగులో మన పురాణాలను, ఇతిహాసాలను, చరిత్రను ఎంతో అద్భుతంగా చెబుతూ.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రవచన కర్త గరికపాటి గారు. గత కొద్దిరోజులుగా గరికపాటి చుట్టూ ఈ మధ్యన వివాదం సాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన గరికపాటి.. అదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదానికి తెర తీశాయి.
అలయ్ బయట్ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి.. అక్కడున్న వారితో ఫోటోలు దిగుతుండగా.. చిరంజీవి ఫోటోలు దిగడం ఆపాలని, అప్పుడే తాను ప్రసంగం మొదలుపెడతానని గరికపాటి చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ గరికపాటి మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. గరికపాటి పాత వీడియోలను పోస్ట్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెట్టారు.
దీని మీద ఇప్పటి వరకు మెగా అభిమానులు స్పందించారు, ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి రాంగోపాల్ వర్మ.. పరోక్షంగా స్పందించారు. కాగా తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన మంచు విష్ణు ఈ అంశం మీద స్పందించారు. గరికపాటి – చిరంజీవిల మధ్య నడిచిన వివాదం గురించి మాట్లాడుతూ.. చిరంజీవికి సపోర్ట్ చేయడంతో పాటు, పరిస్థితులే అలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
గరికపాటి-చిరు వివాదంపై మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్టుగా తెలీదు, గరికపాటి గారు ఏదో మాట్లాడారు. చిరంజీవి ఫ్యాన్స్ .. అదీ ఇదీ అని! పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనతో ఫోటో తీసుకోవడమనేది అభిమానులకు సువర్ణావకాశం. ఆయన దగ్గరకు ఎవరైనా సరే పరుగెత్తుకు వెళ్లి ఫోటో తీసుకుంటారు. ఆ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎక్సైట్మెంట్ లో ఉంటారు’ అని అన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…