Actor Ajay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలకు, హీరోయిన్లకే కాదు.. మిగిలిన నటులకు కూడా ఎంతో గుర్తింపు ఉంటుంది. కమెడియన్లకు, విలన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల జాబితాలో నటుడు అజయ్ కూడా ఒకడు. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా, విలన్ గా తన యాక్టింగ్ తో మెప్పించాడు.
సినిమా ఇండస్ట్రీలో 22 సంవత్సరాలుగా కొనసాగుతున్న అజయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాడు. తాను తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంటేనే చేస్తానని, అలా లేకపోతే చేయనని అజయ్ వివరించాడు. ఇక గత కొంతకాలంగా తాను సినిమాలు చేయకపోవడానికి కారణం మంచి క్యారెక్టర్ రాకపోవడమే అని తెలియజేశాడు.
ఇక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను నటుడు అజయ్ పంచుకున్నాడు. తాను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇంటి నుండి పారిపోయినట్లు తెలిపాడు. నేపాల్ కు వెళ్లి.. అక్కడ నానా ఇబ్బందులు పడ్డానని అజయ్ వివరించాడు. ఇంటికి తిరిగి రావడానికి డబ్బులు లేకపోవడంతో అవస్థలు పడ్డానని, హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు వచ్చాక తిరిగి ఇంటికి వచ్చినట్లు అజయ్ తెలిపాడు.
కాగా అజయ్.. ప్రభాస్, రాజమౌళి చేసిన ‘ఛత్రపతి’ సినిమాలో హీరో ఫ్రెండ్ గా, రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాలో టిట్లా అనే విలన్ క్యారెక్టర్ లో నటించడం అందరికీ తెలిసిందే. తన 22 సంవత్సరాల కెరీర్ లో అజయ్ ఎన్నో విలన్ పాత్రలు, నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలు, అన్న పాత్రలు, ఫ్రెండ్ పాత్రలు వేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…