Chitti babu : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. ఇది ప్రతి ఏడాది జరిగేదే. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఆయనతో ఫోటోదిగాలని ఎవరికి ఉండదు, అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయనపై అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోలు దిగడజం ఆపేసి వచ్చారు. ఇక ఈ ఇష్యూ మీద నాగబాబు గారు గరికపాటి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ ఇష్యూని గరికపాటి గారు, చిరంజీవి గారు చాలా హుందగా వ్యవహరించిన వదిలేసినా పక్కన ఉన్నవాళ్లు వదలడం లేదు.
సిరివెన్నెల అయిపోదామని గరికపాటి ని అవమానిస్తావా…
ఇక ఇష్యూ ని తాజాగా తన నెత్తి మీదికి తెచ్చుకున్నాడు పాటల రచయిత అనంత్ శ్రీరామ్. గరికపాటి గారిది తప్పు అంటూ అన్నయ్య ను అలా ఎలా మాట్లాడుతావు గడ్డిపోచతో నువ్వు సమానం అంటూ మాట్లాడడంతో ఈ ఇష్యూ మరోసారి రాజుకుంది. ఇక ఈ ఇష్యూ మీద అనంత్ శ్రీరామ్ మాటల మీద సీనియర్ నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు. అనంత్ శ్రీరామ్ మీద ఫైర్ అయ్యారు. పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోదామని చిరంజీవి గారిని కాకాపడుతున్నాడు అంటూ కాకాసురా అంటూ సంభోదిస్తూ అనంత్ శ్రీరామ్ మీద మండి పడ్డారు.
చిరంజీవి, గరికపాటి ఇద్దరూ పెద్దవారు, హుందగా విషయాన్ని వదిలేసారు. మధ్యలో ఈ ఇష్యూతో లబ్ది పొందాలనుకునే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. గరికపాటి గారిని గడ్డితో పోల్చావు నువ్వు ఆయన జ్ఞానం ముందు ఏంటో ముందు అది తెలుసుకుని మాట్లాడు. ప్రవచనం అందరూ చెప్పలేరు దానికి సరస్వతి కటాక్షం ఉండాలి. నువ్వు వెనకేసుకొస్తున్న చిరంజీవి గారు ఆయన తమ్ముడు నాగబాబు ఒక ఫంక్షన్లో అభిమానులు పవన్ కళ్యాణ్ అని అరుస్తుంటే వాడు వస్తే మాట్లాడుతాడు మీరు ఊరికే ఉండండి అని ఆసహనం వ్యక్తం చేయలేదా, మri అది తప్పు కాదా. అయినా చిరంజీవి గారే వదిలేసాక మీరెందుకు మధ్యలో అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇలా గరికపాటిని విమర్శించి చిరంజీవి గారి సినిమాలో పాటలు రాసే అవకాశం కోసం ప్రయత్నాలు ఇవన్నీ అంటూ విమర్శించారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…
హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…
ఇప్పటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో ఎదగడం అనేది చాలామందికి పెద్ద సవాలుగా మారింది. మంచి విద్య, కష్టపడే స్వభావం ఉన్నా…