Daksha Nagarkar: చైతూ లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది… షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Daksha Nagarkar: దక్షా నగార్కర్ పరిచయం అవసరం లేని పేరు.హోరా హోరా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా ఓ పాటలో నటించారు. ఇలా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా ఈ సినిమా వేడుకలలో నాగ చైతన్యకు కళ్ళతో సైగలు చేసి హాట్ టాపిక్ గా మారింది.

దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో తెగ పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7 వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగచైతన్య గురించి మాట్లాడుతూ చైతు లాంటి అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుందని తెలిపారు.చైతన్య ఎంతో సింపుల్ గా ఉండటమే కాకుండా అమ్మాయిల విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారని తెలిపారు.

Daksha Nagarkar: సారీ చెప్పేవారు…

బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో తనను హగ్ చేసుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని అయితే ఆ షూట్ కంప్లీట్ అయిన తర్వాత తన వద్దకు వచ్చి సారీ చెప్పేవారు అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.