Movie News

Upasana: దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్… ఫోటోలు వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. గత పది సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోతుండడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఇన్ని రోజులు పిల్లలగురించి ఆలోచించకపోవడానికి కారణం ఉందని ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని ప్లాన్ చేసుకున్నట్లు ఉపాసన తెలిపారు.

ఇక ప్రస్తుతం తమకు పిల్లలు ఉంటే బాగుంటుందనిపించి పిల్లలను ప్లాన్ చేసుకున్నామని తాజాగా ఉపాసన ఓ సందర్భంలో తెలియజేశారు. ఇకపోతే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన భర్తతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ పూర్తి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో సందడి చేసిన ఉపాసన తాజాగా తన భర్త రామ్ చరణ్ తో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.

ఇలా దుబాయ్ లో కొద్ది రోజులపాటు ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ఇండియా రానున్నారు.ఇక దుబాయిలో తన స్నేహితులు కజిన్స్ తో కలిసి ఉపాసన ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే దుబాయ్ లో ఉన్నటువంటి తన స్నేహితులు కజిన్స్ తనకు సీమంతపు వేడుకలను చేసినట్టు తెలుస్తుంది.

Upasana: స్నేహితులు కజిన్స్ సమక్షంలో బేబీ షవర్..

ఈ క్రమంలోనే దుబాయిలో నమ్మోస్ బీచ్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించినట్టు తెలుస్తోంది.ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ ఉపాసన స్నేహితులతో పాటు కజిన్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఉపాసన తెలుపు రంగుగౌనులో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దుబాయ్ వెకేషన్ పూర్తి కాగానే రామ్ చరణ్ తిరిగి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago