Designer Neha : శాకుంతలం సినిమా కోసం జ్యువలరీ ఎలా డిజైన్ చేశామంటే… ఎంతమంది పనిచేసారంటే… నగలను చేయడానికి పట్టిన సమయం…: జ్యువలరీ డిజైనర్ నేహా

Designer Neha : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ గుణశేఖర్ గారు. రాజుల కాలం నాటి కథ అనగానే అందులో అలంకరణకు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ వేసుకున్న నగలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఆ నగల కథ తెలుసుకుందాం.

శాకుంతలం కోసం కొన్ని నెలలు కష్టపడ్డాము…

శాకుంతలం లో సమంత ధరించిన నగల వైపు ఇపుడు మహిళలు చూపు అన్నట్లుగా ఉంది. భారీ నగలైనా సింపుల్ గా ఉన్న నగలైనా అన్నీ ఆకర్షనియాణంగా ఉంటూ కథలో ఇమిడి పోయాయి. అప్పటి కాలానికి సరిపోతూ ఇప్పటి తరానికి నచ్చేలా ఉన్నాయి. ఇక ఆ నగలను డిజైన్ చేసింది వసుంధర జ్యువలరీ వారు. అందులో వసుంధర గారి చెల్లి నేహా జ్యువలరీ డిజైనర్. సుమారుగా పది మంది కష్టపడి ఆరు ఏడు నెలల పాటు కష్టపడి జ్యువలరీ డిజైన్ చేశారట. ఇక ఎక్కువగా కష్టపడింది దుష్యంతుడి నగల కోసమే అంటూ చెప్పారు నేహా.

ఆయనకు సరిపోయే పెద్ధ నగలను అందునా వేసుకున్నపుడు కంఫర్ట్ గా ఉండేలా డిజైన్ చేయడం కత్తి మీద సాములా అనిపించింది అంటూ తెలిపారు. ఇక జ్యువలరీ బరువుగా ఉన్నాయి, ఎక్కువగా సమంత తల మీద వేసుకున్న జ్యువలరీ బరువుగా ఉన్నాయి. అవన్నీ మోస్తూ వాళ్ళు నటించడం చాలా గ్రేట్ అనిపించింది అంటూ నేహా తెలిపారు. ఇక ఎక్కువగా అడవిలో శాకుంతల ఉంటుంది కాబట్టి అలాంటి తీమ్స్ నగలకు తీసుకున్నాం. జింకలను, పూల తీగలను ఎక్కువగా నగల మీద డిజైన్ గా వాడాము అంటూ చెప్పారు నేహా.