Featured

Actress Shresta : మంచు మనోజ్ తో పెళ్లి… అ ఆమాట అనగానే… మోహన్ బాబు గారు బాగా తిట్టారు…: నటి శ్రేష్ఠ

Actress Shresta : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమరసింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి శ్రేష్ఠ. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్ల్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన శ్రేష్ఠ ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అందులో ఫ్యాక్షన్ ఎంత ఆకట్టుకుందో అంతే ఎఫెక్ట్ ఇలాంటి సెటిమెంట్ సీన్స్ కూడా అలరించాయి. అయితే ఆ సినిమాలో నటించిన శ్రేష్ఠ ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

మనోజ్ తో పెళ్లి… మోహన్ బాబు గారు తిట్టారు…

తెలుగమ్మాయి శ్రేష్ఠ అప్పటి తరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరితోనూ బాలనటిగా నటించింది. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి తరువాత తరం హీరోలతోనూ నటించిన శ్రేష్ఠ తాజాగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను తెలిపారు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో మనోజ్ తో తెగ అల్లరి చేసేదాన్ని అంటూ చెప్పిన శ్రేష్ఠ తాను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పింది.

ఇక ఆ సినిమా సమయంలో పరీక్షలు ఉండటం వల్ల సినిమా షూటింగ్ కి లేట్ గా వస్తానని ముందే కో డైరెక్టర్స్ తో చెప్పినా కమ్యూనికేషన్ సరిగా లేక మోహన్ బాబు గారికి విషయం తెలియక షూటింగ్ వెళ్ళాక నన్ను అమ్మను అందరి ముందు అరిచేసారు. కానీ విషయం తెలిసాక మా తప్పేమి లేదని వచ్చి సారీ చెప్పారు. కానీ అందరి ముందు తిట్టి పక్కన సారీ చెప్పారనే ఫీలింగ్ వచ్చింది నాకు అంటూ శ్రేష్ఠ తన అనుభవాలను పంచుకున్నారు. ఇక శ్రేష్ఠ చదువుయ్యాక మోహన్ బాబు గారు మనోజ్ తో తనకు పెళ్లి చేయాలనే ప్రపోజల్ ను శ్రేష్ఠ పేరెంట్స్ వద్ద పెట్టారట, అయితే నో చెప్పారట శ్రేష్ఠ పేరెంట్స్, ఇక ఇంటర్వ్యూలో కారణాలను చెప్పడానికి శ్రేష్ఠ ఇష్టపడలేదు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

7 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

7 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

7 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

7 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

10 hours ago