Devi Prasad : మోహన్ బాబు ఫ్యామిలీతో ఏంటి ఈ ఆటలు… చంద్రహాస్ ఏం చేసాడు…: డైరెక్టర్ దేవి ప్రసాద్

Devi Prasad : ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చి కొన్నిసినిమాలతో హిట్లు కొట్టి ప్రస్తుతం నటుడుగా మాత్రం మంచి గుర్తింవు అందుకున్న వ్యక్తి దేవి ప్రసాద్ గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన చిన్నప్పటి నుండే ఇండస్ట్రీ వైపు రావాలనే ఆసక్తితో చదువుకున్న తరువాత ఇండస్ట్రీకి వచ్చారు. మొదట డైరెక్టర్ కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన శ్రీహరి తో ‘దాస్’ అనే సినిమా తీసినా అది వర్క్ అవుట్ అవ్వక ఆ తరువాత హీరో శ్రీకాంత్ తో ‘ఆడుతూ పాడుతూ ‘అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. అలా డైరెక్టర్ గా బ్లేడ్ బాబ్జి, కెవ్వుకేక వంటి హిట్స్ అందుకున్న దేవి ప్రసాద్ గారు నటుడుగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాలో హీరోకి తండ్రిగా నటించి మెప్పించారు. అలా నటుడుగా మారిన దేవి ప్రసాద్ గారు ప్రస్తుత నటుడుగా సినిమాలలో చేస్తూ బిజీ అవుతున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ అలాగే ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను మాట్లాడారు.

ట్రోల్స్ చేసే వాళ్లంటే నచ్చదు…

దేవి ప్రసాద్ గారు సోషల్ మీడియా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అని, ఎవరికైనా అవకాశం సోషల్ మీడియా ఇస్తుందని, కానీ అపద్ధం కూడా త్వరగా స్ప్రెడ్ అవుతుందంటూ చెప్పారు. మరీ ముఖ్యంగా ట్రోల్స్ రూపంలో జనాలు నవ్వుకోడానికి అని చెప్పి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసి వాళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీని ఎపుడూ ట్రోల్ చేస్తారు. వాళ్ళు చేస్తున్న మంచి పనులు కనిపించవు. అవి ఇండస్ట్రీలో ఉన్న మాకు తెలుస్తాయి, జనాలకు మాత్రం ఈ ట్రోల్స్ వల్ల వారి గురించి తప్పుగా వెళ్తుంది.

ఇక ఇలాంటి పెద్ధ కుటుంబాలను వదిలేస్తే ప్రభాకర్ గారి అబ్బాయి చంద్ర హాస్ ను విపరీతంగా ట్రోల్ చేసారు. ఆ అబ్బాయి మ్యానరిజం అదేనేమో, ఒక్కొక్కరికి ఒక్కోలాగ ఉంటుంది, దానికే ట్రోల్ చేస్తారా?? అందుకే నాకు ఈ ట్రోల్స్ ఇలాంటివి చూడటం ఇష్టం ఉండదు. ఒకరిని బాధపెట్టి మనం నవ్వాలని అనుకోకూడదు అంటూ మాట్లాడారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ల పేరుతో పాత నటుల పర్సనల్ విషయాలను కూడా మాకు తెలుసు అన్నట్లు కొంతమంది చెబుతుంటారు, ఈ మధ్య యూట్యూబ్ లో ఇది ఎక్కువైంది. వారికి ఎలా తెలుసు ఆయా నటుల బెడ్ రూమ్ విషయాలు, వాళ్ళు చెప్పే విషయాల్లో కొన్ని నిజం ఉంటాయి మరి కొన్ని అపద్ధాలు ఉంటాయి. డబ్బు సంపాదన కోసం ఇలా చేయడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు దేవిప్రసాద్.