Movie News

Vijayashanthi: ఎన్నోసార్లు చావును దగ్గరగా చూసి వచ్చాను.. విజయశాంతి కామెంట్స్ వైరల్!

Vijayashanthi: వెండితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయశాంతి తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న విజయశాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి నెమరు వేసుకున్నారు. తన చిన్నప్పుడే తన తండ్రి గుండెపోటుతో మరణించారు. అయితే తన తండ్రి మరణాన్ని తలుచుకొని తన తల్లి కూడా మంచాన పడి కొద్ది రోజులకే చనిపోయిందని ఈమె తెలిపారు.

ఇలా తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోవడంతో ఎవరి మీద ఆధారపడకుండా స్వసక్తితో పైకి వచ్చానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారు అందులో కూడా 2000 ఎగ్గొట్టి 3000 మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.ఇలా 3000 నుంచి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వరకు తాను ఎదిగానని విజయశాంతి తెలిపారు.

Vijayashanthi: మంటల్లో చిక్కుకుంటే ఆ హీరో కాపాడారు…

ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించే సమయంలో ఎన్నో సాహసభరితమైన సన్నివేశాలలో నటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా సార్లు షూటింగులలో గాయపడి ఎన్నోసార్లు చావును దగ్గరగా చూసి బయటకు వచ్చానని తెలిపారు. ఒకసారి విమాన ప్రమాదం మరొకసారి నీటిలో కొట్టుకపోవడం ఇంకొకసారి అగ్ని ప్రమాదానికి గురి కావడం ఇలా చాలాసార్లు ప్రమాదానికి గురయ్యానని తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా మంటల్లో చిక్కుకోవడంతో అందరూ భయంతో పరుగులు పెట్టినప్పటికీ నటుడు విజయ్ కాంత్ మాత్రం తనని రక్షించారని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago