Sundeep Kishan: సాధారణంగా రెండు మూడు సినిమాలలో ఒకే జంట కలిసి నటిస్తే వారి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఒకే సినిమాలో కలిసిన నటించడం వల్ల వారి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.ఈ క్రమంలోనే నటుడు సందీప్ కిషన్ నటి రెజీనా మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
రెజీనా సందీప్ కిషన్ ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అదేవిధంగా రెజినా పుట్టినరోజు సందర్భంగా సందీప్ తనతో ఎంతో చనువుగా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే పాప ఐ లవ్ యు.. అంతా మంచే జరగాలి అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ విధంగా రెజీనా సందీప్ కిషన్ మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మైకెల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ కిషన్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ మేము నాలుగు సినిమాలలో కలిసిన నటించాము. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదని తెలిపారు.
రెజీనా తనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా.. తాను ఏదైనా పని నిమిత్తం ముంబై వచ్చిన ప్రతిసారి తన సోదరి గదిలోనే ఉంటుందని తెలిపారు. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెబితే మీకు చాలా బోర్ గా అనిపిస్తుంది. అందుకే మా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని,ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తను నేను మంచి స్నేహితులు మాత్రమేనని ఈ సందర్భంగా రెజీనాతో తనకు ఉన్న రిలేషన్ గురించి సందీప్ కిషన్ బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…