Chiranjeevi: ప్రస్తుతం బుల్లితెరపై అలాగే ఓటీటీలలో ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదివరకే ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం రెండవ సీజన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇలా ఈ కార్యక్రమం మంచి సక్సెస్ కావడంతో సోనీ లీవ్ లో కూడా సరికొత్త టాక్ షో ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం తరహాలోనే సోనీ లీవ్ లోసింగర్ స్మిత వ్యాఖ్యాతగా నిజం విత్ స్మిత అనే టాక్ షో ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని చిరంజీవి నాని సాయి పల్లవి వంటి తదితరులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తారని మొదటి సీజన్ నుంచి వార్తలు వస్తున్నాయి అయితే మొదటి సీజన్లో రాలేదు కానీ రెండవ సీజన్లో పక్కా అని చెప్పారు. అయితే రెండవ సీజన్ కూడా ముగింపుకు చేరుకుంది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనలేదని అర్థమవుతుంది.
ఇలా బాలయ్య షోలో కనిపించని చిరంజీవి సింగర్ స్మిత షోలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి బాలయ్య షోకి హ్యాండ్ ఇచ్చినట్లేనా అంటూ కొందరు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండవ సీజన్లో చిరంజీవి పాల్గొనే అవకాశాలు లేకపోయినా మూడవ సీజన్లో ఆయన పాల్గొంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి మూడో సీజన్లో చిరంజీవి పాల్గొంటారా లేకుంటే బాలయ్య టాక్ షోకి దూరంగా ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…