Dhanraj : జబర్దస్త్ లో రోజుకి లక్ష ఇచ్చేవారు… డబ్బులన్నీ పోవటానికి కారణం… శ్రీ ముఖి ఫోన్ చేసి : ధనరాజ్

Dhanraj : ‘జై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనరాజ్ ఆ తరువాత ‘జగడం’ సినిమాతో మొదటి సారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందర్ వంటి సినిమాలతో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇక జబర్దస్త్ షో ధనరాజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ధనరాజ్. తెలుగులో మొదటి సారి మొదలయిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆరు వారాల తరువాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇక ఆ తరువాత మా టీవీ లో కామెడీ షో చేస్తూ ప్రస్తుతం ఒకవైపు సినిమాలను చేస్తున్నారు. ఇక జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఉంటూ మంచి రెమ్యూనరేషన్ తీసుకున్న ధనరాజ్ సంపాదించిన డబ్బు సినిమాలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు.

సినిమా బాగున్నా కలెక్షన్స్ లేవు…

జబర్దస్త్ లో పనిచేసే టైం లో ధనరాజ్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాక ఒక ఎపిసోడ్ కి దాదాపు లక్ష రూపాయాలను రెమ్యూనరేషన్ గా తీసుకునేవాడట. ఇక సంపాదించిన డబ్బును బాగా సన్నిహితుడైన సాయి అచ్యుత్ చిన్నారి అని డైరెక్టర్ తో సినిమా చేయడానికి పెట్టుబడిగా పెట్టాడు. అలా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమాకు నిర్మాత గా మారాడు. ఒక వేళ సినిమా పోతే అని ఆలోచన లేదంటూ పోయినా జబర్దస్త్, ఇంకా చేతి నిండా సినిమాలు ఉన్నాయి సంపాదించుకోవచ్చు అని ధైర్యం తో సినిమా నిర్మాణం లోకి అడుగులేసాడు. ఇక సినిమాలో శ్రీముఖి హీరోయిన్, జులాయి సినిమాలో తనని చూసిన డైరెక్టర్ తాను హీరోయిన్ అయితే బాగుంటుందని తీసుకున్నారు.

సినిమా రిలీజ్ అయ్యాక వారం రోజులు సినిమా ఉంటుంది అని థియేటర్ల తో ఒప్పందం చేసుకుని విడుదల చేయగా సినిమా మొదటి రెండు రోజులు కొన్ని థియేటర్స్ లో టికెట్స్ దొరకలేదు. ఆ సమయంలో శ్రీ ముఖి ఫోన్ చేసి టికెట్స్ కావాలని అడిగింది, వారం రోజులు సినిమా బాగానే ఆడినా ఆ తరువాత ‘బాహుబలి’ సినిమా రావడం వల్ల థియేటర్ లో మా సినిమా తీసేసారు. వారం రోజులకే అగ్రిమెంట్ ఇవ్వడం వల్ల అదీకాక బహుబలి లాంటి సినిమా వచ్చినపుడు మనమే తప్పుకోవాలి అనిపించింది, అలా సినిమా బాగున్నా కలెక్షన్స్ పోయాయి నష్టపోయాను కానీ నేను అసలు వాటి గురించి అలోచించి డబ్బు పెట్టలేదు. ఒకవేళ అదే డబ్బు భూమి మీద పెట్టుంటే ఇప్పుడు కోట్లు అయ్యుండేది అంటూ తన చేదు అనుభవాలను పంచుకున్నారు.