Narasimha Raju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద ఉన్న మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
తెలియక వాళ్ళు చేస్తున్న పనిని కామెంట్ చేసాను…
ఆంధ్ర కమల్ హాసన్ గా బిరుదు తెచ్చుకున్న నరసింహ రాజు గారు సినిమాల్లో అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. పలు సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా పలు తమిళ సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1974 లో ‘నీడలేని ఆడది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహ రాజు గారు విఠలాచార్య గారి జానపద సినిమాలో దాదాపు 12 సినిమాలను చేశారు. ఇక దాసరి నారాయణరావు గారి సినిమాల్లో కూడా ఎక్కువగా నటించిన నరసింహ రాజు గారు దివిసీమ ఘటన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర హీరోలైనా జోలె పట్టి చందాలు వసూలు చేసి అక్కడి ప్రజలకు సదుపాయాలను కల్పించారు.
అయితే అలా అగ్ర హీరోలు జోలె పట్టే సమయంలో నరసింహరాజు గారు వీళ్ళు అగ్ర హీరోలు కదా వెళ్లేందుకు చందాలు వసూలు చేస్తున్నారు వాళ్ళే కొంత డబ్బు విరాళం ఇస్తే అయిపోతుంది కదా, జనాల్లోకి వెళ్లడం ఎందుకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. కానీ అది తప్పు అని మళ్ళీ అర్థమైంది అప్పుడు అల్పజ్ఞానం తో అవగాహన లేక అలా మాట్లాడాను కానీ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఆ సంఘటన తరువాత కలిసినా ఆ కామెంట్స్ మీద స్పందించలేదు, పట్టించుకోలేదు నన్ను ఆప్యాయంగా మాట్లాడించారు అంటూ నేను సక్సెస్ ఫుల్ హీరో అయ్యాక అర్థమైంది జనాల్లోకి వెళ్లి మాట్లాడటం ఎంత కష్టమైన పనో నేను ఎంత తప్పుగా మాట్లాడానో అంటూ చెప్పారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…