Director Ram Gopal Varma : ఇప్పటి నుండి ఇండస్ట్రీలో అందరూ రాజమౌళి ఫ్లాప్ కోసం ఎదురుచూస్తుంటారు…: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

Director Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూల గురించి తనదైన శైలిలో మాట్లాడుతుంటాడు ఆర్జీవి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు పొందింది, అలాగే అవార్డులు కొడుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు రావడానికి అసలు కారణం రాజమౌళి మాస్టర్ మైండ్. ఇక రాజమౌళి గురించి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో చెప్పారు.

రాజమౌళి ఫ్లాప్ కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది…

రాజమౌళి తెలుగు సినిమా తీరును మార్చేశాడంటూ వర్మ తెలిపారు. రాజమౌళి చూపించినట్లు సినిమాను ఇంకెవరూ చూపించలేకపోతున్నారు. రాజమౌళి సినిమాను చూసిన కళ్ళతో ఇతర సినిమాలను చూస్తుంటే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తేసినట్లుంది అన్నట్లు అనిపిస్తుంది.

అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరికీ టార్గెట్ రాజమౌళి నే. అయితే రాజమౌళి ని మించి సినిమా చేయాలని అనుకుంటారు లేకపోతే రాజమౌళి కి ఫ్లాప్స్ రావాలని కోరుకుంటారు. ఒక్క ఫ్లాప్ అయినా వచ్చి రాజమౌళి కిందకు దిగడా అనుకుంటున్నారు అంటూ వర్మ హాట్ కామెంట్స్ చేసాడు.