Director Sagar : ఆ అమ్మాయి అలా చేయకుండా ఉంటే సుమన్ జైలుకి వెళ్లుండే వాడు కాదు…: డైరెక్టర్ సాగర్

Director Sagar : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు. తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీలోకి కుడా అడుగుపెట్టారు. తెలిగులో మొదట ‘ఇద్దరు ఖిలాడీలు’ సినిమాతో మొదలు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి ‘సితార’ సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి సుమన్ గారు కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో జైలుకి వెళ్లారు. అలా జైలుకి వెళ్లడం ఆయన కెరీర్ మీద బాగా ప్రభావం చూపింది.

ఆ అమ్మాయి వల్లే సుమన్ జైలుకి వెళ్ళాడు…

అప్పట్లో గ్లామర్ హీరో సుమన్, దీంతో ఎంతో మంది లేడీ ఫాన్స్ ఆయనకు ఉండేవారు. అలాంటి సుమన్ ను ఒక డిజీపి కూతురు బాగా ఇష్టపడటం, ఆయన షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లడం చేసేవారట. అయితే సుమన్ కు ఆమె అంటే ఇష్టం లేకపోవడంతో పట్టించుకునేవాడు కాదట. కానీ పెళ్ళైన ఆమె సుమన్ చుట్టూ తిరగడం నచ్చని డిజిపి సుమన్ పై కోపం పెంచుకున్నాడు. విషయం అప్పటి తమిళనాడు సీఎం ఎంజీయర్ వరకు వెళ్ళింది.

ఆయన సుమన్ ను పిలిపించి మాట్లాడగా సుమన్ ఆ అమ్మాయికి చెప్పండి అని చెప్పిన సమాధానం నచ్చలేదట ఏంజీఆర్ కు. దీంతో చెన్నై లోని ఒక బిజీ సెంటర్ లో సుమన్ గొడవ చేసాడు అంటూ పోలీసులు కేసు పెట్టారు. సంవత్సరం పాటు బయటికి రాలేనంతగా ఇరికించారు. అయితే సుమన్ వాళ్ళ అమ్మకు అప్పటి గవర్నర్ కు చదువుకునే రోజుల నుండే మంచి స్నేహం ఉండటం వల్ల ఆయన ద్వారా రెండు నెలలకే బెయిల్ తెప్పించి ఆ పైన పోరాడి కేసు నుండి బయటకు రప్పించాంగలిగారట. ఈ విషయాలను డైరెక్టర్ సాగర్ గారు ఆయన మరణించక ముందు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.