ఐశ్వ‌ర్య తండ్రి ఎలా మరణించాడో తెలుసా.. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల కారణంగా..

సినీ కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్యారాజేశ్ తొలినాటి తెలుగు సినీ హీరోల్లో ఒకడిగా ఉన్నఅమ‌ర్‌నాథ్ మనుమరాలు. ఆమె తండ్రి రాజేశ్ ఒకప్పుడు అతడు ‘మల్లెమొగ్గలు’ రాజేశ్ అందరికీ సుపరిచితుడు. ఆనంద భైర‌వి, రెండు జెళ్ల సీత‌ వంటి సినిమాల్లో హీరోగా నటించి కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ లో కనిపించాడు. అయితే అతడు యుక్తవయస్సులో ఉన్నప్పడు అర్థంతరంగా కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబంలోనే కాక అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపాడు.

రాజేష్ కు భార్యతో పాటు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆర్థికంగా మంచిగా ఉన్న రోజుల్లో అతడిని కొంతమంది అతడి వద్ద రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో రాజేశ్‌పై ఆ భారం ప‌డేద‌ని చెప్పుకునేవారు. దీంతో ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక తాగుడుకు బానిసగా మారాడు. దీంతో కుటుంబ భారం మొత్తం భార్య తీసుకొని ఎల్ ఐసీ ఏజెంట్ మారి భ‌ర్త‌నూ, న‌లుగురు పిల్ల‌ల‌నూ పోషించుకుంటూ వ‌చ్చారు.

ఆమె సంపాద‌న‌లో అధిక భాగం రాజేశ్ వైద్యానికే ఖ‌ర్చ‌య్యేది. ఆయ‌న లివ‌ర్ అప్ప‌టికే బాగా దెబ్బ‌తిని పోయింది. ఎంత వైద్యానికి ఖర్చు చేసిన అతడు బతకలేదు. ఐశ్వ‌ర్య‌కు ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో రాజేశ్ కన్నుమూసారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురైన వారు అద్దె ఇంట్లోనే ఉంటూ పిల్ల‌ల‌ను పెంచుతూ వ‌చ్చారు.

ఆ తర్వాత అనుకోని ఘటనలో ఇద్దరు కుమారులను కోల్పోడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చిన ఐశ్వ‌ర్య ఇవాళ న‌టిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కుటుంబాన్నీ నిల‌బెట్టింది. ఇప్పుడు ఆమె తల్లి కూతురుకు వస్తున్న మంచి పేరును చూసి ఎంతో గర్విస్తున్నారు. అప్పట్లో లేడీ కమెడియన్ అందరినీ నవ్వించిన శ్రీ‌ల‌క్ష్మి ఐశ్వర్యకు స్వయానా మేనత్త వరుస అవుతుంది.