సినీ కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్యారాజేశ్ తొలినాటి తెలుగు సినీ హీరోల్లో ఒకడిగా ఉన్నఅమర్‌నాథ్ మనుమరాలు. ఆమె తండ్రి రాజేశ్ ఒకప్పుడు అతడు ‘మల్లెమొగ్గలు’ రాజేశ్ అందరికీ సుపరిచితుడు. ఆనంద భైరవి, రెండు జెళ్ల సీత వంటి సినిమాల్లో హీరోగా నటించి కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ లో కనిపించాడు. అయితే అతడు యుక్తవయస్సులో ఉన్నప్పడు అర్థంతరంగా కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబంలోనే కాక అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపాడు.
రాజేష్ కు భార్యతో పాటు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆర్థికంగా మంచిగా ఉన్న రోజుల్లో అతడిని కొంతమంది అతడి వద్ద రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో రాజేశ్‌పై ఆ భారం పడేదని చెప్పుకునేవారు. దీంతో ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక తాగుడుకు బానిసగా మారాడు. దీంతో కుటుంబ భారం మొత్తం భార్య తీసుకొని ఎల్ ఐసీ ఏజెంట్ మారి భర్తనూ, నలుగురు పిల్లలనూ పోషించుకుంటూ వచ్చారు.
ఆమె సంపాదనలో అధిక భాగం రాజేశ్ వైద్యానికే ఖర్చయ్యేది. ఆయన లివర్ అప్పటికే బాగా దెబ్బతిని పోయింది. ఎంత వైద్యానికి ఖర్చు చేసిన అతడు బతకలేదు. ఐశ్వర్యకు ఏడెనిమిదేళ్ల వయసులో రాజేశ్ కన్నుమూసారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురైన వారు అద్దె ఇంట్లోనే ఉంటూ పిల్లలను పెంచుతూ వచ్చారు.
ఆ తర్వాత అనుకోని ఘటనలో ఇద్దరు కుమారులను కోల్పోడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిన ఐశ్వర్య ఇవాళ నటిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, ఆర్థికంగా కుటుంబాన్నీ నిలబెట్టింది. ఇప్పుడు ఆమె తల్లి కూతురుకు వస్తున్న మంచి పేరును చూసి ఎంతో గర్విస్తున్నారు. అప్పట్లో లేడీ కమెడియన్ అందరినీ నవ్వించిన శ్రీలక్ష్మి ఐశ్వర్యకు స్వయానా మేనత్త వరుస అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…